ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద

సినిమా ఎలా వుంది?
ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద

వరుణ్ తేజ్ ఎలా చేసాడు?
పర్వాలేదు. హిరోగా నిలబడాలంటే ఇంకా కష్టపడాలి. పబ్లిసిటీ కొసమే తొలిప్రేమ & ఖుషి లతో కాంపేర్ చేస్తున్నారు. లోఫర్ & మిస్టర్ ఇచ్చిన షాక్ లకు కొద్దిగా రిలీఫ్ అవుతుందెమో తప్ప, ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసే సినిమా కాదు.

డైరక్షన్ ఎలా వుంది?
తెలంగాణ యాస చాలా చాలా బాగుంది. చాలా వర్క్ చేసినట్టు కనబడుతుంది. పస్టాఫ్ ఎమోషనల్ సీన్స్ చాలా టచ్ చేస్తాయి. పస్టాఫ్ తెలంగాణ సీన్స్ ఎంత బాగున్నాయో, సెకండాఫ్ అమెరికా సీన్స్ అంత నీరసంగా & అంత స్లోగా వున్నాయి.

హిరోయిన్ ఎలా చేసింది?
హిరోయిన్ ఓరెంటెడ్ మూవీ. ఈమె ఈ సినిమాకు ప్రాణం అంటే కరెక్ట్. అదరగొట్టింది. సెకాండాఫ్ వరుణ్ కోసం హిరోయిన్ క్యారెక్టర్ తగ్గించినట్టు వున్నారు.

ఎవరికి నచ్చుతుంది? 
తెలంగాణ వాళ్ళకు కచ్చితంగా నచ్చుతుంది. యూత్ & లేడిస్ కు కూడా నచ్చవచ్చు. మాస్ ప్రేక్షకులు దూరంగా వుండవచ్చు.

గ‌మ‌నిక‌ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. ఇది స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: