సరైనోడు అల్లు అర్జున్ కంటే తెలివైనోడు కత్తి మహేష్ కుమార్

“మెగాఫ్యామిలీని విమర్శించడానికి మనం భయపడవలసిన అవసరం లేదు. మహా అయితే వాళ్ళతో పని చేసే అవకాశం రాదంతే. వాళ్ళ సక్సస్ చూసి ఏడ్చే వాళ్ళ సపోర్ట్ మనకు వుంటుంది. కొద్దిగా వాగ్దాటి వుంటే, మీడియాలో చెలరేగిపొవచ్చు” అని జీవితా రాజశేఖర్ దంపతులు తెలుగు ప్రపంచానికి చాటిచెప్పారు.

అలానే వివిధ కారణాలతో చిరంజీవి మీద కసి పెంచుకున్న వాళ్ళంతా, చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సక్సస్ అవ్వడం ఇష్టం లేక, అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంటారు. ఇదేదో తన మీద ప్రేమతో మోస్తున్నారనే భ్రమలో నిజంగా తనను ఇష్టపడే మెగా అభిమానులను పబ్లిక్ గా అవమానాలకు గురిచేసి మెగా అభిమానులకు దూరమయ్యే పనిలో అల్లు అర్జున్ వున్నాడు. అభిమానులంటే చిల్లర వెధవలని జనాలు అనుకునే విధంగా అల్లు అర్జున్ మెగా అభిమానులను ట్రీట్ చేస్తున్నాడు.

అభిమానించడం అభిమానుల వీక్‌నెస్. ఒక్కసారి అభిమానించడం మొదలుపెడితే జీవితాంత కాలం సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. వీరాభిమానుల సంగతి అయితే, ఇక చెప్పక్కర్లేదు. అభిమానించే వాళ్ళ కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్దమే.

తెలుగులో అటువంటి అభిమానులు, వీరాభిమనులు ఎవరికి ఎక్కువంటే టక్కున వచ్చే సమాధానం “చిరంజీవి”.

వీరాభిమనులు చేసే కొన్ని అతిచేష్టలు వలన, అభిమానులంటే లోకువ. ఫోటో మీటులు ఆశచూపుతూ, వాళ్ళ చేత రక్త దానం, నేత్ర దానం చేయించడం ద్వారా, మెగా అభిమానులకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన హిరో “చిరంజీవి”.

చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ ను సపోర్ట్ చేసిన మెగా అభిమానుల్లో, కొందరు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం నచ్చి, పవన్ కల్యాణ్ ను చిరంజీవి కంటే ఎక్కువ ఇష్టపడటం మొదలు పెట్టారు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి & ఖుషి చిత్రాల హిట్ తో పవన్ కల్యాణ్ కంటూ సొంత ఇమేజ్, సొంత అభిమానులు కూడా తయారయ్యారు.

రాజకీయల ద్వారా సమాజానికి సంబంధించిన సమస్యపై సంబంధిత నాయకులపై ఒత్తిడి పెంచే పనిలో పవన్ కల్యాణ్ వున్నాడు. ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాలేదు. బ్రతుకు తెరువు కోసం ఇంకా సినిమాలు చేస్తున్నాడు. మరో పక్క తన దగ్గరకు వచ్చిన సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఏమి చెయ్యాలి?

పవన్ కల్యాణ్ తీరు కత్తి మహేష్ కుమార్ కు నచ్చలేదంట. ఒక పక్క నేను పవన్ కల్యాణ్ ను కేర్ చెయ్యను అంటూనే, రెచ్చగొట్టే విధంగా పవన్ కల్యాణ్ పై ఘాటైనా విమర్శలు చేసాడు.

వైజాగ్ లో స్పెషల్ స్టేటస్ కోసం ఒకరోజు నిరసన చేయదల్చుకున్న వాళ్ళకు నా సపోర్ట్ వుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. నేను వెళ్ళాను. పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదని కత్తి మహేష్ కుమార్ ప్రశ్నిస్తున్నాడు.

పవన్ కల్యాణ్ షెడ్యూల్ పవన్ కల్యాణ్ కు వుంది. పవన్ కల్యాన్ ను కేర్ చేయని ఈయనకు పవన్ కల్యాణ్ వస్తే ఎంత? రాకపొతే ఎంత?

పవన్ కల్యాణ్ పై ఈయన చేసిన విమర్శలకు చాలామంది స్పందించారు. 95% ఫ్యాన్స్ ఈయనను ఎంతో గౌరవిస్తూ, ప్రభుత్వ పరంగా ఏ అధికారాలు లేని పవన్ కల్యాణ్ ను ఈయన విమర్శించవలసిన అవసరం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసారు. మిగతా 5% ఆవేశంతో మాట్లాడిన మాటలను హైలట్ చేస్తూ, ఆ కాల్స్ కు భయపడుతున్నట్టు నటిస్తూ, కేసులు పెడతానని భయపెడుతూ, రాంగోపాలవర్మ కంటే తెలివిగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

కొసమెరుపుగా నన్ను కెలకొద్దని పవన్ ఫ్యాన్స్ కు పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చెయ్యడం సూపర్ పంచ్.

bottomline:
సరైనోడు అల్లు అర్జున్ కంటే తెలివైనోడు కత్తి మహేష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: