డిసెంబర్ 14 న ‘అజ్ఞాతవాసి’ ఆడియో

ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో  నటిస్తున్న చిత్రం పేరు ఇంకా అధికారంగా ప్రకటించనప్పటికి “అజ్ఞాతవాసి” అని జోరుగా జరుగుతుంది. కారణం ఆ పేరును నిర్మాత రిజిస్టర్ చేయించారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది. పవన్‌తో పాటు కీర్తిసురేష్‌ తదితరులపై కీలక సన్నివేశాలను, పాటలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 10 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘బయటికి వచ్చి చుస్తే’ పాటకు మంచి స్పందన లభిస్తుంది. అనిరుద్ అందించిన ఈ సినిమా మిగతా పాటలు కూడా అదే రేంజ్ లో వుంటాయని అభిమానులు ఆశీస్తున్నారు.

ముందుగా  ఈ సినిమా ఆడియో ను  నేరుగా మార్కెట్ లోకి విడుదల చేద్దాం అని అనుకున్నప్పటికీ,  అనిరుద్ తెలుగులో మ్యూజిక్ చేస్తున్న మొదటి చిత్రం కావడంతో, భారీగా చెయ్యమని పవన్ కల్యాణ్ నిర్మాతను కోరినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: