‘హలో’టీజర్‌

అఖిల్‌ కథానాయకుడిగా విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున ఎంతో నమ్మకంగా నిర్మిస్తున్న ‘హలో’టీజర్‌ను, గురువారం సాయంత్రం   ట్విట్టర్‌లో అక్కినేని నాగార్జున పోస్ట్ చేసారు. ‘‘ఈ భూమి మీద పుట్టిన అదృష్టవంతులు ఎవరు అడ్డువచ్చినా వాళ్ల మనసుకు నచ్చిన వాళ్లని కలుస్తారు. జీవితాన్ని పంచుకొంటారు…’ అంటూ నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలైంది.  టీజర్‌   లోని యాక్షన్‌ దృశ్యాలు, ఛేజింగ్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.  డిసెంబర్ 22 న రిలీజ్ అని మరోసారి ఈ టీజర్లో కన్‌ఫార్మ్ చేసారు.

  కల్యాణి కథానాయిక. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు.

Anytime is hello time!!! Hellooo my friends!!👉👉👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: