రంగస్థలం 1985 రిలీజ్ ఎప్పుడు?

 రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985′ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపద్యలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను సుకుమార్ అత్యంత రియలిస్టిక్ గా తీస్తున్నాడని టాక్. రత్నవేలు కెమెరా మెన్ గా పనిచేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా 2018 సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించినా, పవన్ కల్యాణ్ సినిమా జనవరి 10 అని ప్రకటించాక, ఈ సినిమా విడుదలను వాయిదా వేసారు.  రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా డిసైడ్ చెయ్యలేదు కాని, ఏప్రిల్ చివరి వారంలో బన్నీ తన మూవీని ఫిక్స్ చేసుకొవడంతో “రంగస్థల 1985” రిలీజ్ మార్చి చివరి వారంలో వుంటుందని అందరూ ఊహించుకుంటున్నారు.

తన “ధృవ” సినిమా చిరంజీవి ఖైదీ 150 కి అడ్డు కాకూడదని, క్రిందటి సంక్రాంతిని త్యాగం చేసి ఒక నెల ముందు వచ్చిన రామ్‌చరణ్, ఈ సారి బాబాయ్ “అజ్ఞాతవాసి” కోసం ఈ సంక్రాంతిని త్యాగం చేసి, తన ‘రంగస్థలం 1985′ సినిమా  రెండు నెలలు లేటుగా రిలీజ్ చేస్తున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: