“జవాన్” పై అంచనాలు తక్కువ వున్నా ..

బివిఎస్ రవి దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా  దిల్ రాజు సమర్పిస్తున్న చిత్రం “జవాన్”  డిసెంబర్ 1వ తేదీన విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయిధరమ్ తేజ్  గత రెండు సినిమాలు బాగా ఆడకపొవడానికి తోడు దర్శకుడు బివిఎస్ రవి పై మరీ అంత నమ్మకం లేకపొయేసరికి “జవాన్” పై అంచనాలు బాగా తగ్గిపొయాయి.  కాకపొతే  మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మూడు నాలుగు హిట్ సినిమాలతో మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించేసుకున్నాడు. సినిమా మంచి టాక్ సంపాదించుకుంటే కలక్షన్స్ వర్షం కురిపించడం ఖాయమనే ధీమాతో నిర్మాతలు & డిస్ట్రీబ్యూటర్స్ వున్నారు.

తేజు సరసన మెహ్రీర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రేపు గురువారం జవాన్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: