హైప‌ర్ ఆది డైరక్ట్ గా వ్యక్తులను టార్గెట్ చెయ్యడం తప్పు

అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు

ఒక జబర్దస్థ్ స్కిట్లో హైప‌ర్ ఆది డైలాగ్

తెలుగు కామెడీ ప్రోగ్రామ్స్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈటీవీ జ‌బ‌ర్ద‌స్థ్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చాలామంది తిడుతూనే ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఎంజాయ్ చెయ్యడానికి ఎన్ని కారణాలు వున్నాయో, ఈ షోను తిట్టడానికి కూడా అన్నే కారణాలు చూపెడుతూ వుంటారు. వివాదాలకు కూడా లోటు లేదు.

వెటకారమే ఇంధనంగా నడిచే ఈటీవీ జ‌బ‌ర్ద‌స్థ్ షోలో వివాదాలు సృష్టించడం చాలా ఈజీ. ప్రతి డైలాగ్ లోనూ ఏదొకటి వెతకొచ్చు. మీడియా రాజ్యానికి చక్రవర్తి రామోజీకి భయపడి చాలామంది వెనక్కి తగ్గుతూ వుంటారు.

ఈ షోకు ఆదరణ తగ్గుతుందనుకునే సమయంలో హైపర్ ఆది స్కిట్లు క్లిక్ అయ్యి, మళ్ళీ జనాదారణ మరింత పుంజుకుంది. కొన్ని హైపర్ ఆది పంచ్ లు వ్యక్తులను వుద్దేశించి వుండటం, కొందరు వాటిని కామెడీగా కాకుండా, సిరియస్ గా తీసుకొవడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆ వ్యక్తులు హైపర్ ఆది స్కిట్లను భూతద్దంలో చూస్తూ, అనాధలపై హైపర్ ఆది చెప్పిన డైలాగ్ ను అడ్డుపెట్టుకొని హైప‌ర్ ఆది ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

హైప‌ర్ ఆదికి సపోర్ట్ గా ఈనాడు మీడియా వుంది కాబట్టి, పెద్ద ప్రొబల్మం ఏమీ వుండకపొవచ్చు. హైప‌ర్ ఆదికి మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ అనుకొవచ్చు. వ్యక్తులను వుద్దేశించే వేసే పంచ్ లు ఆ క్షణంలో క్లిక్ అవ్వొచ్చెమో కాని, అలా చెయ్యడం తప్పు. తన శైలిని మార్చుకొని సరికొత్త డైలాగ్స్ తో మరింత అలరిస్తాడని ఆది ఫాలోయర్స్ ఆశీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: