డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్

Keerthy Suresh‏Verified account @KeerthyOfficial
Dubbing for the first time in Telugu anndddd finished successfully! Now I feel complete!😀

Title from tomorrow 😁

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25 వ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సోషల్ మీడియా ద్వారా హైప్/పబ్లిసిటీ చేసిచేయనట్టుగా, బాగానే చేస్తున్నారు. మిగతా సంగతి మీడియా & ఫ్యాన్స్ చూసుకుంటున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ & అను ఇమ్మాన్యుయేల్ హిరోయిన్లు. ఒక హిరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు సబంధించిన నా డబ్బింగ్ పని ఈరోజుతో అయిపోయిందంటూ ఆమె చేసిన ట్వీట్ ఈ రోజు న్యూస్.

చివరి దశ షూటింగ్లో ఉన్న ఈ చిత్రానికి తమిళ సంగీతం దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ డిసెంబర్ నెలలో భారీగా వుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం విడుదలకానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: