అజ్ఞాతవాసి ‘వారణాసి’ షెడ్యూల్ అయిపోయింది

త్రివిక్రమ్-పవన్‌కల్యాణ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు వుంటాయని వాళ్ళకు ముందే తెలుసు. మరింత పెంచడం వాళ్ళకు ఇష్టం లేదు. అలా అని అసలు చెయ్యకుండా వుంటే కుదరదు. మీడియా కావాల్సిన లీకులు, ఆ సినిమాకు పనిచేస్తున్న వాళ్ళ చేత ఫోటోలు రిలీజ్ చేయిస్తూ సినిమా విశేషాలు న్యూసులో వుండే విధంగా చాలా బాగా ప్లాన్ చేసినట్టే.

లాస్ట్ షెడ్యూల్ వారణాసి లో ప్లాన్ చేసి, అక్కడే “అజ్ఞాతవాసి” టైటిల్ & లోగో రివీల్ చేసారు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు మరియు ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ చేసినట్టు సమాచారం. అజ్ఞాతవాసి ‘వారణాసి’ షెడ్యూల్ అయిపోయింది, ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలివుంది. హైదరాబాద్ లో ఫినిష్ చేస్తారు.

జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియోను 18 లేదా 19నహైదరాబాద్ లో జరపబోతున్నట్టుగా లీకు చేసారు, కాని ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: