అజ్ఞాతవాసి -The Heir Apparent -నిజమెంత?
90% తెలుగుసినిమాలు అక్కడ నుంచి ఇక్కడ నుంచి లేపుకొచ్చేవే. కాకపొతే, మన తెలుగుప్రేక్షకుల నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేస్తూ వుంటారు. మార్పులు చేర్పులకు మంచి మాటలు జోడించి తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో త్రివిక్రమ్ నెం 1 అని అనొచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏ సినిమా నుంచి లేపుకొచ్చారో కనుక్కొవడం, క్షణాల్లో ప్రపంచం మొత్తం చేరిపొవడం జరుగుతుంది.
‘The Heir Apparent ’ అనే ఓ ఇంగ్లిష్ చిత్రం ఆధారంగా తీసుకుని, త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ కథ రాసు కున్నాడని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.
సోషల్ మీడియా దృష్టిలో అలా లేపుకురావడం తప్పు. త్రివిక్రమ్ మ్యాజిక్ తో చేసే మార్పులు చేర్పులు డామినేట్ చేసి ఆ తప్పును ఒప్పుగా చేసేస్తాయి. ఎక్కడ నుంచి లేపుకొస్తే మనకేంటి, మన డబ్బులకు సరైన వినోదాన్ని మనకు ఇచ్చిందా లేదా చూడాలి తప్ప అని మరో వర్గం కౌంటర్లు ఇస్తూ వుంటారు.
అసలు సొషల్ మీడియాను పట్టించుకొని తెలుగు ప్రేక్షక లోకం మాత్రం త్రివిక్రమ్-పవన్‌కల్యాణ్ కాంబినేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కారణం ఇంతకు ముందు వారి కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ మంచి కమర్షియల్ హిట్ అవ్వడమే.
bottomline: కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలే జవాబులు
Q: అజ్ఞాతవాసి -The Heir Apparent -నిజమెంత?
A: who cares?