రోబో 2.0 కు దారివ్వండి

భారతదేశం గర్వించతగ్గ  స్టార్ & కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 2.0. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో రజనీకాంత్ & శంకర్ కాంబినేషన్ లో ఘనవిజయం సాధించిన రోబో కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈచిత్రం విడుదలపై లైకా ప్రొడక్షన్స్‌ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు చెక్‌పెడుతూ విడుదలకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. 2018 ఏప్రిల్‌ నెలలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో ప్రకటించింది. వెనువెంటనే బన్నీ వాసు(?) స్పందిస్తూ వాళ్ళేదో తమకు అన్యాయం చేసున్నట్టుగా పబ్లిక్ వేదికపై మరో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఏప్రిల్ అంటే ఇంకా నాలుగు నెలలు వుంది. నాలుగు నెలల ముందే డేట్ ఎనౌన్స్ చేసారంటే గొప్ప విషయమే. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా నిర్మింపబడతాయి. వాటిని గౌరవించవలసిన అవసరం తోటి సినిమా ఇండస్ట్రీలో అందరిపై వుంది. దాని కనుగుణంగా మిగతా సినిమాల డేట్స్ ఎడ్జస్ట్ చేసుకొవాలి.  ఇబ్బందులేమైనా వుంటే ఆ నిర్మాతలను డైరక్ట్ గా కాంటాక్ట్ చేసి కన్‌ఫార్మ్ చేసుకొవాలి.

bottomline:

అప్పట్లో దాసరి నారాయణరావు ఎంత పట్టుబట్టినా, “ఈగ” సినిమా కోసం తన “జులాయి” సినిమాను ఒక నెల వాయిదా వేసుకున్న బన్నీని ఆదర్శంగా తీసుకొవాలి. ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీ రేంజ్ పెంచే ఒక పెద్ద సినిమాను గౌరవిస్తూ, తమ సినిమా రిలీజ్ డేట్ ను ఎడ్జస్ట్ చేసుకొవడం అవమానం కాదు. కాంప్రమైజ్ అయ్యే దర్శకుడు/నిర్మాత/హిరోల పై గౌరవం పెంచుతుంది.

సినిమా ప్రచారానికి ఇలా వివాదాలు సృష్టించడం అనే వ్యూహం ద్వారా బన్నీ వాసు(?), మెగాఫ్యామిలీ పరువు తీయడం బాగోలేదని మెగాఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: