బన్నీ వాసు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించినప్పుడు, మెగాఫ్యామిలికి అవార్డులు రావాలంటే అంటూ ఏవో వ్యాఖ్యలు చేసినప్పుడు, పబ్లిక్ అంతా అల్లు అరవింద్/అల్లు అర్జున్ మెప్పు కోసం చేసాడనుకున్నారు. మంచి సినిమాకు రాలేదని అడగటంలో తప్పు లేదు కాని, ఇలా ఫ్యామిలికి రాలేదని కామెంట్ చెయ్యడం కచ్చితంగా జనాలను(మెగాఫ్యాన్స్ ను) రెచ్చగొట్టి, చివరికి మెగాఫ్యాన్స్ ను వెర్రిపప్పలను చెయ్యడమేనని అందరికీ అర్దం అయ్యింది. ఫ్యామిలీ అంటూ ఇతగాడు రేపిన అలజడికి మరికొందరు కులం ప్రాంతం అంటూ కలిపి కంపు కంపు చేసి వదిలారు.

ఏమి సాధించారు అంటే శూన్యం. కాని, వివిధ చర్చల్లో ఇతగాడి మాటలను అబ్జర్వ్ చేసిన వాళ్ళకు అసలు ఈ “బన్నీ వాసు ఎవరు?” అనే ప్రశ్న రేకెత్తించాడు.

A) అల్లు అర్జున్ PA
B) అల్లు అరవింద్ బినామీ
C) మెగాఫ్యామీలీ official/unofficial రిప్రజెంటివ్
D) కాపు జాతిని వుద్దరించడానికి కొత్తగా ఉదయించిన వీరుడు

ఏ హోదాలో ఈ రకమైన వివాదాలు సృష్టించి, మెగాఫ్యామిలీ స్థాయిని దిగజార్చే పనులు చేస్తున్నాడో ఆయనే చెపితే కాని మెగా అభిమానులకు తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: