యథా రాజా తథా ప్రజ..

“ప్రజలు నాయకులకంటే అవినీతి పరులు.. ప్రజలు గొర్రెలు.. ప్రజలు చెడిపొయారు..” ఇలా ప్రజలను నిందించడం అందరికీ అలవాటైపోయింది. ఇలా ప్రజలను నిందించడం చాలా తప్పు. వాళ్ళను అలా తయారుచేసిన నాయకులను నిందించాలి.

నిజానికి ప్రజలు నిస్సాహాయులు. నాయకుడు వాళ్ళ ముందుండి సన్మార్గంలో నడిపించాలి. నాయకుడనే వాడు ప్రజల కోసం బ్రతకాలి. కానీ ప్రజల మీద బ్రతుకుతున్నారు. వారి మధ్య విద్వేషాలు పెంచి బ్రతుకుతున్నారు.

ప్రజలు వేసే ఓటుకు విలువ లేదు. ఇది నిజం. దానికి కారణం 95% of నాయకులు. ఓటును డబ్బు/కులం/ప్రాంతం/మతం లతో ప్రజలను మభ్యపెట్టి కొనేసుకుంటున్నారు. ప్రజలకు నాయకులను ప్రశ్నించే అర్హత లేకుండా చేస్తున్నారు. ప్రజలకు ఆప్షన్స్ లేకుండా చేస్తున్న నాయకులు మారనంత వరకు ప్రజలు ఏమీ చెయ్యలేని నిస్సాహాయులే.

ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ & పవన్ కల్యాణ్ పార్టీ నెగ్గుకు రావడం అసాధ్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వున్నాడు కాబట్టి, వైయస్సార్‌సిపి వాళ్ళు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశాన్ని విమర్శించిన రోజు, తెలుగుదేశం & వైయస్సార్‌సిపి పార్టీల మధ్య అన్నయ్య కంటే ఎక్కువ నలిగిపొవడం ఖాయం అని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవన్నీ పవన్ కల్యాణ్ కు తెలుసు. తెలిసి కూడా ఏదో మార్పు తేవాలని చేస్తున్న ఈ ప్రయత్నంకు దేవుడే సహకరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: