జనంలోకి .. జనం కోసం

పవన్ వెంట నడిచేది ఆయన కులానికి చెందిన వాళ్ళే ఎక్కువ అని మన తెలుగు మీడియా చెపుతూ వుంటుంది. అది నిజమే. ప్రజల్ని అలా విడగొట్టేసి, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు మన రాజకీయ నాయకులు.  జనాల వీక్‌నెస్ రెచ్చగొట్టి వాడుకొని, తిరిగి జనాల తప్పే అని జనాలని తిడుతూ వుంటారు ఈ రాజకీయ నాయకులు.

ఈ రాజకీయ నాయకుల ప్రభావం వలన పవన్ కల్యాణ్ వేసే ప్రతి అడుగుకి ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నా కులం నా ప్రాంతం కాదని విమర్శించే వాళ్ళు కూడా అంత కంటే ఎక్కువ మంది తెలుగువాళ్ళే వుంటారని టాక్.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చెయ్యడం ద్వారా తెలుగుదేశానికి చెందిన కొందరికి దగ్గరయితే, వైయస్సార్‌సిపికి చెందిన కొందరికి దూరమయ్యాడు.  రాజకీయ నాయకుల చేతిలో కులం ప్రాంతం పేరుతో ఇలా విడిపొయిన  ప్రజలను, కుల ప్రాంతాలకు ఆతీతంగా తను పనిచేస్తాడని నమ్మించడం కష్టం.

పొగిడేవాడు/విమర్శించే వాడు ..  ప్రతొక్కడు ఎదో అజెండాతో పని చేసేవాళ్ళే.  ఇవన్నీ తెలిసికూడా సినిమాల్లో సాఫీగా సాగుతున్న తన ప్రయాణాన్ని కాదనుకొని ఈ రొచ్చు రాజకీయల్లోకి రావాలనుకొవడం మూర్ఖత్వమేనని చాలామంది పవన్ కల్యాణ్ శ్రేయాభిలాషులు కామెంట్ చేస్తూ వుంటారు.

ఎవరిష్టం వాళ్ళది. ఎవరి డెసిషన్ వాళ్ళది. పవన్ కల్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. “పవన్ కల్యాణ్ మాటలు వింటారా.. పవన్ కల్యాణ్ వెనకాలే వస్తారా? పవన్ కల్యాణ్ కు తోడుగా ఉందాం వస్తారా! రండి విందాం” ..

ఏమీ ఆశీంచకుండా పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్న అందరికీ🙏🙏🙏

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: