డిసెంబర్‌ 12న ‘అజ్ఞాతవాసి’ రెండో పాట

పవన్‌ కల్యాణ్‌ రెండు పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. ఒక పక్క ప్రజా సమస్యలను అధికార ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతూ జనసేన పార్టీ నిర్మించే ప్రయాణం ఒకటి అయితే, రెండో ప్రయాణం జీవనధారం కోసం సినిమాలు.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ ఫినిష్ కాగానే, గ్యాప్ లేకుండా “డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా” ప్రైవేటీకరించొద్దనే అందులో పనిచేస్తున్న కార్మికుల వాయిస్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు.

మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ టీం రెండో పాటను డిసెంబర్‌ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొదటి సాంగ్ ‘బైయటికొచ్చి చూస్తే..’ పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అనిరుధ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కన్పించబోతున్నారు. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రిలీజ్ చేయబోతున్న రెండో సాంగ్ ‘గాలి వాలుగ..’ అనే పల్లవితో వుండబోతున్నట్టుగా చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటిస్తూ పాట పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో పవన్‌ స్టైల్‌గా నిలబడి పాట పాడుతున్నట్లుగా ఉన్న స్టిల్‌ బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: