రంగస్థలం 1985 ఫస్ట్‌లుక్‌ వాయిదా

లెక్కల మాస్టర్ సుకుమార్‌ & చిరుతనయుడు రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం రంగస్థలం 1985. మెగా అభిమానుల ఫోకస్ అంతా ‘అజ్ఞాతవాసి” పై వుండటం వలన, ఇప్పుడు “రంగస్థలం 1985’ కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మంచి ఓపినింగ్స్ సాధించాలంటే జనాలకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ, ఎంగేజ్ చేస్తూ, అంచనాలను పెంచవలసిన బాద్యత ఆ చిత్ర యూనిట్ పై వుంది. అందులో భాగంగా రంగస్థలం 1985 ఫస్ట్‌లుక్‌ను మొదట డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పుడు ఒకరోజు వాయిదా వేసినట్టుగా ప్రకటించింది. డిసెంబర్‌ 9 (శనివారం) ఉదయం 9గంటలకు విడుదల చేస్తారట.

పీరియడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్‌, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: