పవన్ కల్యాణ్ అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాడు

పవన్ కల్యాణ్ అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాడనిపిస్తుంది, కారణం గత నాలుగైదు సంవత్సరాలుగా జనాలు చేసే విమర్శలన్నీ  మర్చిపోకుండా  ఒకచోట వ్రాసిపెట్టుకున్నాడనుకుంట. దేనికైతే సమాధానాలు చెప్పాలనుకున్నాడో వాటికి చెపుతున్నాడు. ఇక్కడ తప్పు పట్టాల్సింది విమర్శలు చేసిన వాళ్ళను,  ఎక్కువ మాట్లాడేస్తున్నాడని పవన్ కల్యాణ్ ను కాదు.

సమాధానం చెప్పాల్సిన అవసరం వుందా?
అందరి మీద విమర్శలు వస్తూ వుంటాయి. కాని, జనాలు మెగా ఫ్యామిలీ మీద వచ్చే విమర్శలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే మీడియా వాటిని ఎక్కువ హైలట్ చేస్తూ వుంటుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పడంలో తప్పు లేదు.

ప్రజారాజ్యం ఘోరమైన ఓటమికి కారకులెవరు?
రాజకీయం అంటే ద్రోహులు వుంటారు. వారిని కంట్రోల్ చేయలేక పొవడం చేతకానితనం. ఒక పాఠంగా భావించి ముందుకు సాగాలి తప్ప, వాళ్ళను శత్రువులుగా చూడటం కరెక్ట్ కాదు. there are no permanent friends or enemies in politics.

పవన్ కల్యాణ్ సరికొత్త తప్పులు:
పార్టీ అంటే ఒక్కడు కాదు. అధినాయకుడు ఒక్కడే అయినా, అధి నాయకుడికి సపోర్ట్ చేసే నమ్మకమైన & బలమైన నాయకులు వుండాలి. ఇన్ని సంవత్సరాలు అయినా ఎవరూ కనిపించడం లేదు, వినిపించడం లేదు. “జనసేన పార్టీ” నేనొక్కడనే అన్న రీతిలో సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడే తప్పులు చేస్తున్నాడనటం సరి కాదు, బహుశా అదే పనిలో(నమ్మకమైన & బలమైన నాయకులను ఎన్నుకునే పనిలో) పవన్ కల్యాణ్ వుండి వుండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: