ABN రాధాకృష్ణను తప్పు పట్టడం సరికాదు

పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా సక్సస్ అయ్యి, చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పవన్ కల్యాణ్   కాపు కులానికి చెందిన వాడు. ఆయన వెంట ఎక్కువ వుండేది కాపులే. ఆ రీజన్స్ వలనే చంద్రబాబు పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్ళాడు, తప్ప సామాజిక సృహ వుందని కాదు. ఇది నిజం. ఇదే నిజాన్ని, ABN రాధాకృష్ణ తన మీడియాలో ప్రచారం చేస్తే పవన్ కల్యాణ్ కు కోపం వచ్చేస్తుంది ఎందుకో.

పవన్ కల్యాణ్ కు కుల పిచ్చి అంటే బాదపడాలి కాని, పవన్ కల్యాణ్ వెంట వుండేది కాపు కులానికి చెందిన వాళ్ళే అనే నిజాన్ని చెపితే కోపం దేనికి?

ABN రాధాకృష్ణ ఎవరంటే తెలంగానలో స్థిరపడ్డ కమ్మ కులానికి చెందిన ఆంధ్రవాడు అని అందరూ అనుకుంటూ వుంటారు. కష్టపడి ఎదిగాడు & పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నాడు. ఆయన చుట్టూ ఆయన బంధువులు, కులస్థులు చేరడం సహజం. ఆయన ఛానల్లో ఆయనకు నమ్మకమైన బంధువులు & కులస్థులు వుండటంలో తప్పేముంది?  మనుగడ కోసం కమ్మ కులానికి చెందిన తెలుగుదేశం పార్టీని అనుకూలంగా ప్రచారం చేస్తాడు. ఇదే విషయాన్ని ఆయన్ని అడిగినా ఒప్పుకుంటాడు. బయట పెట్టడానికి ఏముంది?

bottomline:
నిజాన్ని నిర్భయంగా చెప్పే ABN రాధాకృష్ణను తప్పు పట్టడం సరికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: