ప్రజారాజ్యంకు సీక్వెల్ జనసేన
పవన్ కల్యాణ్ ఎంత ఎత్తుకు ఎదిగినా B/O చిరంజీవే. తనవంతుగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం గెలుపు కోసం ఎంత కష్టపడగలడో అంత కష్టపడ్డాడు. ఓవర్ కాన్ఫిడెన్స్, చిరంజీవి కోటరి స్వయంగా చేసిన తప్పులు & ప్రత్యర్దుల కుట్రలు .. ఇలా సవా లక్ష కారణాల వలన ప్రజారాజ్యం ఘోర పరాజయం చూడవలసి వచ్చింది.
చిరంజీవికి నడపటం చేతకాకో, నడపటం ఇష్టం లేకో, ఒత్తుడుల తలవొగ్గో కాంగ్రెస్ లో విలీనం చేసాడు. చిరంజీవి అలా చేతులెత్తేయడం చాలామంది చిరంజీవి అభిమానులకే నచ్చలేదు కాని, అన్నయ్య మెతక స్వభావం అర్దం చేసుకొని కొందరు అవమానంగా ఫీల్ అయ్యారు. కొందరు బొంగులే అని అనుకున్నారు.. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సర్ది చెప్పుకున్నారు.
జనసేన మీటింగ్స్ లో పవన్ కల్యాణ్ ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలను చెపుతూ పరకాల ప్రభాకర్ & so on .. లను విమర్శించడం జరిగింది. వారికి సరైన సమాధానం జనసేన ద్వారా చెపుతానని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ఇదే అదనుగా ప్రజారాజ్యంకు సీక్వెల్ జనసేన అంటూ వెటకారంతో కూడిన విమర్శలు మొదలయ్యాయి.
పవన్ కల్యాణ్ ఎంత ఎత్తుకు ఎదిగినా B/O చిరంజీవే. ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలను గుర్తు చేసుకుంటూ, జనసేన పార్టీని నిర్మించుకొవడంలో తప్పేముంది?
bottomline:
“ప్రజారాజ్యంకు సీక్వెల్ జనసేన” అని ఎవరైనా అంటే నెగిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.