వైయస్సార్‌సిపి నుంచి గౌరవం ఆశీంచడం కరెక్ట్ కాదు

ఓట్లు కొంటూ అడ్డంగా దొరికిపోయింది తెలుగుదేశం పార్టీ. చెప్పేవి మాత్రం పతివ్రత కబుర్లు. అందరూ దొంగలే అన్నది నిజం. మొత్తం రాజకీయ వ్యవస్థ కుళ్ళిపొయింది. అధికారం అంటే ఆఫీషియల్ గా దోచుకొవడం. జగన్ మాత్రమే దొంగ అనటం సరికాదు. తెలుగుదేశం వాళ్ళు జేబు దొంగలు, జగన్ మాత్రం గజదొంగ, అందుకే జేబు దొంగకు సపోర్ట్ చేస్తున్నాను అనటం మనల్ని మనం మోసం చేసుకొవడమే.  జగన్ కు దమ్ము కాస్త ఎక్కువ, తండ్రి పవర్ లో వున్నప్పుడు ఏమి చెయ్యగలడో  చేసాడు. దోచుకొవడానికి అవకాశం కలిపించిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించేసరికి కేసుల్లో ఇరికించారు.

పవన్ కల్యాణ్ జగన్ మీద ఘాటైన విమర్శలు చేసాడు. వైయస్సార్‌సిపి  వాళ్ళు కూడా ఘాటుగా స్పందిస్తారు. అన్ని కోణాల్లో పవన్ కల్యాణ్ ను కుమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు. కుమ్మేవాళ్ళను సపోర్ట్ చేస్తారు. వైయస్సార్‌సిపి నుంచి గౌరవం ఆశీంచడం కరెక్ట్ కాదు. కాని గట్టిగా తిప్పి కొట్టాలి.

ప్రత్యర్దులు చేసే విమర్శలు ఎదుర్కొవడానికి పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని రూల్ పెట్టుకోకూడదు. పవన్ కల్యాణ్ నమ్మే వ్యక్తులను ఒక వలయంగా ఏర్పర్చుకొని వాళ్ళ చేత సమాధానం ఇప్పిస్తే చాలు. ప్రజారాజ్యం మాదిరి జనసేన కూడా చేతులు కట్టుకొని కూర్చొకూడదు.

bottomline:

తప్పు చెయ్యనోడు & తప్పు చెయ్యాలనే ఆలోచన లేనోడు, తప్పు చేసినోడిని చూసి భయపడవలసిన అవసరం లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: