మార్చి 30న రంగస్థలం

త్రివిక్రమ్ -పవన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ వుందో, సుకుమార్-రామ్‌చరణ్ కాంబినేషన్ కు కూడా అంతే క్రేజ్ వుంది.

సినిమాకు పనిచేస్తున్న ప్రముఖుల బర్త్ డే లకు విషెస్, స్వతంత్ర దినోత్సవం, దసరా శుభాకాంక్షలు .. ఇలా ఏదొక సందర్భం క్రియేట్ చేసుకొని ఆ సినిమాకు సంబంధించిన సమాచారం మెయిన్ మీడియాకు, సొషల్ మీడియా ద్వారా వదలటం ప్రస్తుతం ట్రెండ్. సందర్భం ఏమి లేకపొతే, రెండు మూడు రోజులు ముందు పలనా రోజు విడుదల చేస్తున్నాం అని ఒక ఫీలర్ వదలటం.

ట్రెండ్ ను ఫాలో అవుతూ రామ్ చరణ్ ఆనందంతో డాన్స్ చేస్తున్న ఓ ఫొటోను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. 1985 అనే సంవత్సరాన్ని టైటిల్ నుంచి తొలిగించారు. ఫస్ట్‌లుక్ తో పాటు మార్చి 30 అంటూ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, రెండు పాటలు, ఐదు రోజులు ప్యాచ్ వర్క్ మినహా మిగతా షూటింగ్ అంతా ఫినిష్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: