జన సైనికులరా … శ్రీ కత్తి మహేష్ ను ఆపొద్దు

సొఫాలు వేసి కూర్చోపెడతారని ఆశీంచి పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక సమావేశాలకు వెళ్లిన ఓ మహిళ, అక్కడ జరిగిన తొక్కిసాలాట నుంచి తాను ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో పొస్ట్ చేసింది. శ్రీ కత్తి మహేష్ స్పందించడానికి ఒక పాయింట్ దొరికింది. స్పందించేసాడు.

‘ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ లోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు? పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళల్లారా… తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి’

–శ్రీ కత్తి మహేష్

“గబ్బర్ సింగ్” సినిమా ఆడియో ఫంక్షన్ సాయంత్రం అయితే, పొద్దున్న సింహాచలం గుడిని దర్శించుకున్నాడు. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో తక్కువ సెక్యూరిటితో వెళ్ళాడు. అప్పుడు అక్కడ జరిగిన తొక్కిసాలాటతో పవన్ కల్యాణ్‌కే వూపిరాడనంత పని చేసారు. అలా వుంటుంది మాబ్ మెంటాలిటీ.

bottomline:
జన సైనికులరా … శ్రీ కత్తి మహేష్ ను ఆపొద్దు. ప్రజలు నిస్సాహాయులే కాని, పవన్ కల్యాణ్ ను దేవుడిగా భావించే అభిమానులను అడ్డుపెట్టుకొని పవన్ కల్యాణ్ & పవన్ కల్యాణ్ అభిమానులకు ఆపాదిస్తున్న లేనిపొని విషయాల్లో ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొలేనంత అజ్ఞానంలో పబ్లిక్ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: