Hello తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నాం — అక్కినేని నాగార్జున

అఖిల్‌ హీరోగా, కళ్యాణి ప్రియదర్శిన్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ అండ్‌ మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రం ‘హలో’. ఈ చిత్రం డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. అనూప్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం వైజాగ్‌లో జరిగింది. బిగ్‌ సీడీని ఆంధ్రప్రదేశ్ మాన‌వ వ‌న‌రుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆడియో సీడీలను గంటా శ్రీనివాసరావు విడుదల చేయగా, తొలి సీడీని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ Hello బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అని అంటున్నాడు.

 • అఖిల్‌తో దగ్గరుండి సినిమా చేస్తానని మాటిచ్చాను.
 • అఖిల్‌ సినిమా కంటే ముందుగా చైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అనే సినిమా చేశాను. అదే ఆడియో వేడుకలో `వస్తున్నాం..కొడుతున్నాం..`అని చెప్పాను.అన్నట్టే హిట్ కొట్టాం.
 • అది పూర్తయిన తర్వాత అఖిల్‌తోఈ సినిమా చేసే పనిలోనే ఉన్నాను.
 • మా మనసుకు దగ్గరైన డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌. మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలి?. తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో లెజెండ్‌గా నిలిచిపోయిన నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుండగా, నాకు దేవుడులా వచ్చిన విక్రమ్‌కుమార్‌ నాతో మనం లాంటి సినిమా చేశాడు. నాన్నగారిని ఎంతో గొప్పగా సాగనంపాడు.
 • ఇప్పుడు అఖిల్‌ని ఈ సినిమాతో రీలాంచ్‌ చేస్తున్నాను. అఖిల్‌ను ఎలా చూడాలనుకున్నాను అనే విషయాన్ని విక్రమ్‌తో చెబితే తను `హలో` సినిమాను తయారు చేశాడు. అక్కినేని అభిమానులు అఖిల్‌ను ఎలా చూడాలనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు.
 • అలాగే విక్రమ్‌ కుమార్‌ను చైతన్యతో సినిమా చేయమని ముందుగానే అడిగాను. అన్నపూర్ణ స్టూడియోలో నెక్స్‌ట్‌ మూవీ విక్రమ్‌ దర్శకత్వంలో నాగచైతన్యతో ఉంటుంది. ఇదే ప్రేమతో ఆ సినిమా కూడా చేస్తాం.
 • తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్యాన్స్‌, గ్రేస్‌ నేర్పింది అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయన అచ్చుగుద్దినట్లు అఖిల్‌లో కనపడతున్నాడు.
 • అన్నపూర్ణ టీం అందరూ అఖిల్‌ను పెద్ద హీరోను చేయాలని.. ప్రేమతో ప్రతి యాక్షన్‌ని, సీన్‌ను తీశారు.
 • చాలా రోజుల క్రితం ‘హలో గురు ప్రేమ కోసమేరా జీవితం..’ అని ప్రియన్‌గారు నన్ను, అమలను కలిపారు.
 • డెస్టినీ అంటారో ఏమో కానీ, ఇప్పుడు ప్రియదర్శన్‌ అమ్మాయి క‌ల్యాణి ..అఖిల్‌తో సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో కల్యాణి అద్భుతంగా నటించింది. తనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.
 • ఈ వేడుక‌కు ముందు వైజాగ్‌లో తుఫాన్‌ ఉందన్నారు. కానీ అన్నపూర్ణ టీం సభ్యులు ‘మీరు వైజాగ్‌ వెళ్లండి సార్‌..పైన నాన్నగారున్నారు. ఆయన చూసుకుంటారు’ అన్నారు. అదే భరోసాతో ఇక్కడికి వచ్చాను. మ్యాజిక్‌ జరిగింది. ఏం కాలేదు.
 • మాకు వైజాగ్‌, రాజమండ్రి, కాకినాడ అంటే నాకు ప్రాణం. నేనైతే ఎన్నో సినిమాలను ఇక్కడ షూటింగ్‌ చేశాను.
 • గంటా శ్రీనివాసరావుగారు మేం వైజాగ్‌లో ఫంక్షన్‌ చేయాలనగానే ‘ఏం కావాలి..నాగ్‌’ అన్నారు. అలాంటి వ్యక్తి వైజాగ్‌ పిలిస్తే ఎందుకు రాకుండా ఉంటాం. తప్పకుండా వస్తాం.
 • ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. డిసెంబర్‌ 22న ప్రేక్షకులు ముందుకు వస్తున్నాం.
 • ఈ సినిమా మొదలయ్యేటప్పుడు ఎలాగైనా అఖిల్‌, అభిమానులకు హిట్ సినిమా ఇస్తాన‌ని..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనుకున్నాను.
 • మూడు రోజుల క్రితమే సినిమాను చూశాను. `వస్తున్నామూ..బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నాం…ఇది ఫిక్స్‌

  —అక్కినేని నాగార్జున

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: