మరీ ఇంత క్లాస్ అయితే మాస్ పరిస్థితి ఏమిటి?

త్రివిక్రమ్ శ్రీనివాస్ & పవన్ కళ్యాణ్కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలోని ‘గాలి వాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ..’ అంటూ సాగిపోతున్న రెండో పాట ఆడియోను మంగళవారం రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచందర్ ఆలకించారు. 4 నిమిషాల 18 సెకనుల నిడివితో అనిరుద్ రవిచందర్ అందించిన లిరిక్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది. కాని,  మరీ ఇంత క్లాస్ అయితే మాస్ పరిస్థితి ఏమిటి? అని అంటున్నారు మాస్ మెగా అభిమానులు.

భారీ అంచనాల నడుమ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ .. నా గుండె కి తగిలి
తపించిపోనా .. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా .. చెలి ఇలా దొరికితే నీ స్నేహం

ఎం చేసావే
మబ్బులను పువ్వుల్లో తడిపి 
తేన జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి 
తపన పెంచుతావే

నడిచే హరివిల్లా  
నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా 
అణువణువునా విల విలమనదా 
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా 
గాలిపటంలా ఎగరకే అల్లా 
సుకుమారి సొగసులు 
అలా ఒంటరిగా వదలాలా…

చూస్తానే గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ .. నా గుండె కి తగిలి
తపించిపోనా .. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా .. చెలి ఇలా దొరికితే నీ స్నేహం

కోర కోర కోపమేల 
చుర చుర చూపులేల 
మనోహరి మాడిపోనా  అంత ఉడికిస్తే 
అరె అని జాలి పడవే పాపం  కదే ప్రేయసి 
సరే  అని చల్లపడవే మోసి పిశాచి
ఉహు అలా తిప్పుకుంటూ ఉలికిపోకే ఊర్వశి 
అహో అలా నవ్వుతావే  మీసం మెలేసి 
ఎన్నాలింకా  ఊరికే ఊహల్లో  
ఉంటావ్ పెంకీ పిల్లా
చాల్లే ఇంక మానుకో 
ముందు వెనుక చూసుకొని పంతం
ఆలోచిద్దాం  చక్కగా కూర్చొని చర్చిద్దాం 
చాలు యుద్ధం రాజి కి వద్దాం 
కొద్దిగా కలిసొస్తే  నీకేమి కష్టం  

నడిచే హరివిల్లా .. నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా 
అణువణువునా విల విలమనదా .. నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా .. గాలిపటంలా ఎగరకే అల్లా 
సుకుమారి సొగసులు .. అలా ఒంటరిగా వదలాలా…

ఎం చేయాలో లే

గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ .. నా గుండె కి తగిలి
తపించిపోనా .. ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా .. చెలి ఇలా దొరికితే నీ స్నేహం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: