డిసెంబర్ 16న ‘అజ్ఞాతవాసి’ సెకండ్ టీజర్

‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ టీజర్ ఆ సినిమా పేరు పెట్టకుండానే, PSPK25 అంటూ పవన్ కల్యాణ్ కు సంబంధించిన కుర్చీ తిప్పుతున్న చిన్న బిట్ రిలీజ్ చేసారు.  ఇప్పుడు సెకండ్ టీజర్ ఎప్పుడనేది ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ అధికారికంగా డిసెంబర్ 16న ఈ టీజర్ విడుదల చేయబోనున్నట్లు  తెలిపింది.  ఈ టీజర్లో ఏముంటుందనేది సస్పెన్సే.

గత రెండు మూడు రోజుల్లో రిలీజ్ అయిన ‘గాలివాలుగా’ సాంగ్ & దానికి అనిరుధ్ తో ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో జనాలకు విపరీతంగా నచ్చేసింది.

కీర్తి సురేష్ , అను ఎమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాలు అందరికీ తెలిసినవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: