అత్తారింటికి దారేది 2

అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ మార్క్ చిన్న చిన్న మేనరిజమ్స్ తో టీజర్ కట్ చేసాడు త్రివిక్రమ్. ఎక్కువ హాడావుడి లేకుండా చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పవర్ స్టార్ నుండి అభిమానులు ఏమి కోరుకుంటారో అది మనకి అందించారు.

టీజర్ ని సరిగ్గా గమనిస్తే, వారణాసిలో మొదలయ్యే ఈ కథ హైదరాబాద్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా కనిపిస్తున్న పవన్ కల్యాణ్ అందరితో సరదాగా వుంటూనే సందర్భానుసారం తన దమ్ము చూపిస్తూ వుంటాడు.

ఈ అజ్ఞాతవాసి ఎవరు? ఇక్కడ తన పనేంటి? తన ఐడింటీ ఇక్కడ ఎందుకు రివీల్ చెయ్యలేదు అనేది స్టోరీ అన్నట్టుగా చెప్పకనే చెప్పారు టీజర్లో. “వీడి చర్యలు ఊహాతీతం వర్మ” అని మురళి శర్మ అంటే,”that’s the beauty” అనే రావురమేష్ సమాధానం తో టీజర్ ముగుస్తుంది

విజువల్స్, పవన్ కల్యాణ్ గెటప్ & రావురమేష్.. అత్తారింటికి దారేది సినిమాను గుర్తుకు తెచ్చారు. Anirudhs fresh music and top notch cinematography, ,pk mark simple mannerisms తో టీజర్ అదిరిపోయిందనుకొవచ్చు.

One thought on “అత్తారింటికి దారేది 2

  • December 16, 2017 at 3:50 pm
    Permalink

    Good analysis

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: