‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూ గెటప్

khushbusundar‏Verified account @khushsundar
I am glad I waited this long..Wanted to do something really worth giving my time to..thank you #Trivikram for having faith in me n your smiles..thank you @PawanKalyan for being a through gentleman n giving me the space to be me..n thank you @haarikahassine for being such a gem.❤

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. టీజర్లో ఖుష్బూ స్పీచ్ ఇస్తున్నట్టు చూపించారు కాని, ఫేస్ చూపించలేదు.  కొంచెం సస్పెన్స్ లో పెట్టారు.

తాజాగా ఖుష్బూ ‘అజ్ఞాతవాసి’ సినిమా కొత్త పోస్టర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో ఆమెతోపాటు పవన్‌ ఉన్నారు. ఖుష్బూ కుర్చీలో కూర్చొని కోపంగా చూస్తుంటే.. పవన్‌ ఆమె వెనుక నిల్చొని అంతే కోపంగా చూస్తున్నారు.

“ఇన్నేళ్లు ఇలాంటి విలువైన పాత్ర కోసం ఎదురుచూశాను, తనను నమ్మి ఆ పాత్రకు ఎంపిక చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. పవన్‌ అద్భుతమైన వ్యక్తి, ఆయనకు, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థకు కృతజ్ఞతలు”  అంటూ ఫోటోతో పాటు కామెంట్ పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: