ఒక్క క్షణం -టీజర్ కంటే ట్రైలర్ బాగుంది

మన ఖర్మకి అల్లు శిరీష్‌ని కూడా తెరమీద హిరోగా చూడాల్సి వస్తుందనేది ప్రతి తెలుగుసినిమా ప్రేక్షకుడి గుండె చప్పడు. చూడమని ఎవరూ బలవంత పెట్టరు, తను హిరో అవ్వడం వలన పదిమందికి అవకాశాలు కల్పిస్తున్నాడని సరిపెట్టుకో అన్నది సినీ పరిశ్రమ జవాబు. నేను హిరోగా ఎందుకు అనర్హడనేది అల్లు శిరీష్ కసి & పట్టుదల.

అల్లు శిరీష్‌పై వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెడితే, అల్లు శిరీష్ హీరోగా, సురభి హీరోయిన్‌గా.. ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థపై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. శ్రీనివాస్ అవ‌స‌రాల‌, సీర‌త్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ప్రేక్షకుడికి క్లారిటీ ఇంపార్టెంట్. మొన్నప్పుడో రిలీజ్ అయిన “ఒక్క క్షణం” టీజర్ అర్దం కాని డైలాగ్స్ తో చాలా కన్‌ఫ్యూజన్ గా వుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం చాలా క్లారిటీగా వుంది.

శ్రీనివాస్ అవ‌స‌రాల‌ & సీర‌త్ క‌పూర్ జీవితంలో ఏమి జరిగిందో, అదే అల్లు శిరీష్ & సురభి జీవితంలో జరుగుతూ వుంటుంది. జరగరాని ఒక భయంకరమైన బాదాకరమైన ఒక సంఘటన అవ‌స‌రాల‌ & సీర‌త్ జీవితంలో జరిగింది కాబట్టి, అదే సంఘటన అల్లు శిరీష్ జీవితంలో జరగబోతుందని ముందే తెలుసు కాబట్టి, అది జరగకుండా హిరో ఆపగల్గాడా ? లేదా అన్నదే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. క్లైమాక్స్ బాగుంటే, అల్లు శిరీష్‌కు మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుద్ది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: