AB ఎవరో నీ బేబి

Oh ho AB ఎవరో నీ బేబి
మెల మెల ఇటు మెరుపుల రాతిరి.. అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి .. ఎటు నీ దారి
చంద్రుడే.. చుక్కలో చిక్కెరో .. మబ్బుల్లో నక్కెరో
ఓ ప్రేమ విహారి .. ఎటు రా నీ గురి

ఓ వైపు వొల్కనొ .. ఓ వైపు సైక్‌లోను
వొణెకెను తడిసిన నగరంలా.. కులుకే చెదిరెను హృదయం

ఓ వైపు సైనైడ్లు .. ఓ వైపు ఉరితాడు
వలపుల జైల్లొ ఖైదిలా .. ఇది దారి లేని తరుణం

భొషొ.. దేవుడా పువ్వులతొ ప్రణయమ
కౌగిలి కలహమ .. నవ్వులతో నరకమే న్యాయమా

హొల.. దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతొ చెయ్యడం భావ్యమా

మెల మెల ఇటు మెరుపుల రాతిరి.. అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి .. ఎటు నీ దారి

Oh hoo AB ఎవరో నీ బేబి

ఇరు నడకల నాట్యం .. ఏ పాదం తన సొత్తంటుందో
చిరునగవుల లాస్యం .. ఏ పెదవికి సొంతం

కనుపాపల స్వప్నం.. ఏ కన్ను తన హక్కవుతుందో
ఇరు తీరపు సంధ్రం .. ఏ ఒడ్డుకు సొంతం

AB ఎవరో నీ బేబి
కన్నుల్లొ ఆగి ఆగి
పెదవుల అంచును దాటను అందో

AB ఎవరో నీ బేబి
మదిలోనే దాగి దాగి
బయటకు రానందో

బొభొషొ.. దేవుడా పువ్వులతొ ప్రణయమ
కౌగిలి కలహమ .. నవ్వులతో నరకమే న్యాయమా

హొల.. దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతొ చెయ్యడం భావ్యమా

మెల మెల ఇటు మెరుపుల రాతిరి.. అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి .. ఎటు నీ దారి

Oh ho AB ఎవరో నీ బేబి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: