ధగధగమనే తూరుపు దిశా
ధగధగమనే తూరుపు దిశా .. పడమరనిశై ముగిసెనే
గలగలమనే నది పదనిస .. కన్నీరులో తడిసెనే
కొడవలి భుజమున వేసీ .. కొడుకే కోతకి కదిలే
దర్భను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే
సాధువు కలే వెలుగున పడి .. .. సత్యం ఇలా మెరెసెనే
అజ్ఞాతమే మరుగున పడి.. ఆయుధమెగసెనే
ఎర్రగా తడిపెనే .. ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసినే .. పసిగరిక అంచునో కిరణమే
మెరుపుల దీపం
చమరల్లే చీకటి ఒంపి .. మబ్బుల్లో వెలుతురు నింపి
చిరుజల్లులే కురిపిస్తాడే
చినుకల ధారం
చివరంచుకు నింగిని చుట్టి .. చిగురించే నేలకు కట్టి
రెండింటిని కలిపేస్తాడే
దేవుడు వరం ఇయ్యలేదని అయ్యోరినే నరికెనే
అమ్మా అనీ అనలేదనీ పసిదూడనే నలిపెనే
కొడవలి భుజమున వేసీ .. కొడుకే కోతకి కదిలే
దర్భను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే
సిద్ధుడి ప్రణవంలా వీడు .. బుద్ధుడి శ్రవణంలా వీడు
యుద్ధం అంత శబ్ధం వీడు
వీడొక ప్రమాణం
రణములా నినదిస్తుంటాడు .. శరములా ఎదురొస్తుంటాడు
మరణశరణ తోరణమితడు
వీడొక ప్రమాదం
రెప్పంచున కలా అడుగడునా నిజమై కనిపించేలా
వీడో విడుదలా.. ఎన్ని ప్రాణాల మౌనాలకీవేళ ..
మెరుపుల దీపం
చమరల్లే చీకటి ఒంపి .. మబ్బుల్లో వెలుతురు నింపి
చిరుజల్లులే కురిపిస్తాడే
చినుకల ధారం
చివరంచుకు నింగిని చుట్టి .. చిగురించే నేలకు కట్టి
రెండింటిని కలిపేస్తాడే
ఎర్రగా తడిపెనే .. ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసినే .. పసిగరిక అంచునో కిరణమే
ముళ్ళు ఎన్నని వివరించదే పువ్వుల ఏదే ఎన్నడూ
కన్నీళ్లనే వడబోయదే
మేఘం ఎప్పుడూ