‘కొడకా కొటేశ్వరరావు’ టీజర్‌

పవన్‌కల్యాణ్‌ హిరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎన్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ సినిమాపై భారీ అంచనాలతో పాటు, హైప్ బాగుంది. ఇప్పటికే విడుదలైన పాటల్లో మొదట్లో ఒక్క మాస్ సాంగ్ లేదని కొద్దిగా నిరుత్సాహ పడినా, నిదానంగా శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.

సినిమా మీద వున్న హైప్ తగ్గకుండా, మరీ పెరగకుండా ఒక పద్దతి ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు పబ్లిక్ కి రిలీజ్ చేస్తున్నారు.

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ అంటూ పవన్‌ చేత పాడించిన త్రివిక్రమ్, ‘అజ్ఞాతవాసి’ లో ‘కొడకా కొటేశ్వరరావు’ అంటూ సాగే పాటను పాడించారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ పాటను డిసెంబరు 31న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు.

‘కొడకా కొటేశ్వరరావు’ పాటకు సంబంధించిన టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్‌ పాటను హమ్‌ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ‘కొడకా..’ అంటూ పాటను మొదలపెట్టబోయే ముందు పడిపడి నవ్వుతుంటే ‘పవన్‌కల్యాణ్‌ సర్‌! అంత ఈజీగా ఏమీ తెమలనీయరు. అది నాకు అర్థమవుతోంది’ అని అక్కడి వారు అనడం మరోసారి నవ్వులు పండాయి. దీంతో అనిరుధ్‌ అందుకుని ‘ఐ విల్‌ గివ్‌ ఎ సిగ్నల్‌’ అంటూ 1.. 2.. 3.. అనడంతో పవన్‌ పాట అందుకున్నారు. ఆ తర్వాత ‘పార్టీ టైమ్‌ బిగిన్స్‌ ఫ్రమ్‌ 31 డిసెంబరు 6.00గంటలు’ అని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: