ఒక్క క్షణం -exclusive review

సినిమా ఎలా వుంది? థియేటర్లో చూడొచ్చా?

  1. బాగుంది.
  2. కచ్చితంగా ఒక్కసారి చూడొచ్చు.
  3. స్లోగా వుంది, లెంగ్త్ ఎక్కువ అయ్యింది అని కొందరికి అనిపించినా, కథాపరంగా ఒక్క లాజిక్ కూడా మిస్ అయినట్టు అనిపించదు. బాగా కనెక్ట్ చేసారు.
  4. కన్‌ఫ్యూజన్ లేకుండా స్క్రిన్‌ప్లే వుంది.

అల్లు శిరీష్ ఎలా చేసాడు?
అల్లు అర్జున్ కి ఆర్య. అల్లు శిరీష్ కి “ఒక్క క్షణం”. అల్లు అర్జున్ ను ఎనర్జిటిక్ హిరోగా ఆర్య నిలబడితే, అల్లు శిరీష్ ను డిఫరెంట్ హిరోగా నిలబెట్టే సినిమా “ఒక్క క్షణం”.

సాయి ధర్మ్ తేజ్ మాదిరి, మెగాఫ్యాన్స్ చేత కూడా విమర్శలు ఎదుర్కొన్న అల్లు శిరీష్, ఈ సినిమా సక్సస్ తో విమర్శకుల నోళ్ళు మూయించినట్లే అనుకొవచ్చు.

అల్లు బ్రదర్స్ కు మెగాఫ్యాన్స్ సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళ ప్లానింగ్ తో, మిగతా మెగా హిరోలకంటే ముందు వుండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సినిమా ద్వారా దాసరి అరుణ్ కుమార్ కి మంచి బ్రేక్ వచ్చినట్టే. ధృవ సినిమాలో అరవింద్ స్వామి మాదిరి అనిపించాడు.

హైలట్స్ ఏమిటి?

  1. స్లోగా వుంది, లెంగ్త్ ఎక్కువ అయ్యింది అని కొందరికి అనిపించినా, అలా వుండటం వలనే కన్‌ఫ్యూజన్ లేకుండా సాగింది.
  2. కామెడీ సెపరేట్ ట్రాక్ కాకుండా, కథలోనే కలిపిన విధానం చాలా బాగుంది. చాలా బాగా పండింది. అందరూ బాగా చేసారు.
  3. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గానే వుంది.

ఏమి బాగోలేదు?
చాలా పగడ్బంధీగా వ్రాసుకున్న స్క్రిప్ట్. అంతే పగడ్బంధీగా నిర్మించారు. మైనస్ అంటే అల్లు శిరీష్‌పై వున్న నెగిటివ్ ఫీలింగ్ ఒక్కటే. అది కాంప్రమైజ్ అవ్వగల్గితే, డైరక్టర్ కోసం తప్పకుండా చూడవలసిన సినిమా.

గమనికఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: