‘కొడకా కోటేశ్వరరావు’ లిరిక్స్

హేయ్ శర్మ ..
వహ్ హమ్ .. ఇవ్వు

వహ్ వహ్ వహ్ శర్మ, ఇంకా నీకు టచ్ పోలేదోయ్
కంటిన్యూ కంటిన్యూ

హా..హా..

బాబు తుకారం, ఒకగ్లాసు మిర్యాల పాలు
ఖర్చనుకోకపోతే రెండు యాలుక్కాయలుకూడా తగిలించవోయ్
కుమ్మేద్దాం

కొడకా కోటేశ్వరరావు వా

శర్మ గారు నేనేంపాడుతున్నాను? మీరేమి వినిపిస్తున్నారు?

అప్పుడు బాగుందన్నావు .. బాబు

అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు

సారీ కాంతం, నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను .. అవ్వలేనంటే అవ్వలేను
అసలు నా ఊపందుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్ లేరా?

వావ్ బాయ్

కొడకా…. కొడకా….
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో

పులస లాగా ఎగిరిపడితే
హేయ్ పులస లాగా ఎగిరిపడితే
పులుసైపోతవురో

కొడకా…… కొడకా…
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
చెయ్యి పడితే మాడిపోయిన అరిసై పోతవురో

చిరిగిన చి రి గి న….. చి రి గి న..
హా చిరిగిన పర్సైపోతవురో
ఇరిగిన ఇరుసై పోతవురో
ఆ కానీ నిక్కలేస్తే బొమ్మ లేని బొరుసైపోతవురో
తెగిన గొలుసైపోతవురో
మొత్తం మనిషైపోతవురో

కొడకా… ఓరే నీచ నికృష్టపు కోటేశ్వరరావ
నీ దరిద్రం చెప్పాడానికి నా దగ్గరున్న డైలాగులు సరిపోవడంలేదుర

మట్టైపోతవురో చీపురు కట్టైపోతవురో
నువ్వు కిందపడిన ఇత్తడి బిందెకు సొట్టై పోతవురో
రోతైపోతవురో చెత్త బుట్టైపోతవురో
హేయ్ సగం కాలి ఆరిపోయిన చుట్టైపోతవురో

కొడకా…. ఓరి నీ చెత్త
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో

మిడత లాగా మిడిసి పడితే
హెయ్ హెయ్ హెయ్ హెయ్
మిడత లాగా మిడిసి పడితే మసైపోతవురో

కొ కొ కొ కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో

చాచి కొడితే పెనం మీద దోసై పోతవురో
పగిలిన గ్లాసైపోతవురో
కరిగిన ఐసైపోతవురో

లొల్లి చేస్తే కత్తికేమో అలుసైపోతవురో
పంపర పనసైపోతవురో
పోపుల దినుసైపోతవురో

కొ కొ కొ కొడకా కోటేశ్వరరావు

పద్మజ గారు
మీరు మధ్యాహ్నం భోంచేసినట్టు లేరు
అందుకే గట్టిగా పాడటడం లేదు

కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో

సోదరీమణులు
అందరూ మరొక్కసారి ముక్త కంఠంతో

కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో
బాగా కరుసైపోతవురో
ఇంకా కరుసైపోతవురో

కరుసైపోయినట్టున్నాడుగా హా

thank you

thank you so much

good opportunity bro ..

హా..హా..హా..హా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: