ఫ్యాన్స్ హ్యాపీ & థాంక్స్ టు గురూజీ
అజ్ఞాతవాసి లో మొత్తం ఆరు పాటలు. ఐదు విడతలుగా విడుదల చేసారు.
- ‘బయటకొచ్చి చూస్తే త్రీవో క్లాక్‘ అనే సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు తీసిన విడియో రిలీజ్ చేసారు
- ‘గాలి వాలుగా‘ అయితే ఫుల్ సరప్రైజ్. అనిరుధ్ మీద స్పెషల్ పిక్చరైజేషన్ చేసి మరీ రిలీజ్ చేసారు
- ‘మధురాపురి సదనా మృదు వదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా‘ పాటను ట్రైలర్ లాంటి టీజర్‌తో రిలీజ్ చేసారు
- ‘ధగధగమని‘ & ‘ఎవరే నీ బేబి‘ పాటలను ఆడియో ఫంక్షన్లో రిలీజ్ చేసారు
- 2018 కానుకగా ‘కొడకా కోటేశ్వరరావు‘ అనే పాటని రిలీజ్ చేసారు
- ఈ ఆరు పాటల్లో ఒక్క ఫుల్ మాస్ సాంగ్ లేదు.
- ఆరడుగుల బుల్లెట్టు లాంటి ఇనిస్టెంట్ హిట్ లేదు. ‘ధగధగమని‘ నాలుగైదు సార్లు వింటే కాని ఎక్కలేదు.
- ‘ఎవరే నీ బేబి‘ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు అయ్య బాబోయ్ ఇదేమి పాట అనుకున్నారు. రిపీట్ గా విన్నాక, చాలా మంది అభిమానులకు ఈ పాట ఫేవరెట్ సాంగ్ అయిపోయింది.
- ‘బయటకొచ్చి చూస్తే త్రీవో క్లాక్‘ & ‘గాలి వాలుగా‘ పక్కా క్లాస్ సాంగ్స్.
- ‘కొడకా కోటేశ్వరరావు‘ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు హై ఎక్సపెటేషన్స్ వలన, ఇంతేనా అనిపించింది. విడియో రెండు మూడు సార్లు చూస్తూ, లిరిక్స్ లో సున్నితమైన తిట్ల దండకం అర్దం చేసుకున్నాక, అబ్బోబ్బో ఈ ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు అని అనిపించక మానదు.
bottomline:
ఆడియో పరంగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ. థాంక్స్ టు గురూజీ.