ఫస్ట్ ఇంపాక్ట్ బీభత్సం

పక్కా ప్లానింగ్ తో సెల్ఫ్ మేడ్ హీరో అల్లు అర్జున్. అల్లు అరవింద్ కు డిస్ట్రిబ్యూషన్ రంగంలో వున్న గ్రిప్ &  మీడియా మేనేజ్‌మెంట్ తో మెగా అభిమానుల సపోర్ట్ లేకుండానే నెట్టుకు రాగలను అనే ధీమా, ప్రతి పబ్లిక్ ఫంక్షన్ లోనూ చూపిస్తున్నాడు. మెగా అభిమానులంటే బానిసలు, కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి అని అంటూ, మెగా అభిమానులకు సంస్కారం లేదని డైరక్ట్ గా మెగా అభిమానులకు విమర్శలు చేస్తూ అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అభిమానం చంపుకోలేని కొందరు అమాయక మెగా అభిమానులు, ఇంకా అల్లు అర్జున్ ఫంక్షన్ కు అటెండ్ అవుతూనే వున్నారు.

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య,  నా ఇల్లు ఇండియా’.  ట్రెండ్ సెట్టర్ గా   పేరొందిన అల్లు అర్జున్, సినిమా సినిమాకు సమ్ థింగ్ ఏదో ఒకటి ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరో, ఇప్పుడు మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ నాపేరు సూర్య టీజర్ ను విడుదల చేసారు. సినిమాలో బన్నీ తప్పులపై కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి గా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇంపాక్ట్ టీజర్ అంతా ఆ వ్యవహారం చుట్టూనే తిరిగింది. మిలటరీ ట్రయినింగ్, బన్నీ ఎమోషన్లు, అన్నీ చాలా పక్కాగా కుదిరాయి. పాత్ర కోసం మేకోవర్ అన్నది బన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అది సన్నాఫ్ సత్యమూర్తి అయినా, డిజె అయినా, ఇప్పుడు నా పేరు సూర్య అయినా. ఆ విషయం టీజర్ క్లియర్ గా తెలియచెప్పింది.

వక్కంతం వంశీ టేకింగ్ చూస్తుంటే, అనుభవం పండిన డైరక్టర్ మాదిరిగా వుంది.  నా పేరు సూర్య సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ బీభత్సంగా  వుందనే టాక్ సంపాదించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: