అజ్ఞాతవాసి ట్రైలర్ -మీకో దండం రా బాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి మూవీ టీజర్ అత్తారింటికిదారేది 2 లా వుందంటూనే సృష్టించిన సునామీ ఎలాంటి దో అందరికీ తెలిసిందే. టీజరే ట్రైలర్ లా వుందని ఒక అభిమాన వర్గం ఫీలయితే, మరో వర్గం మాత్రం ట్రైలర్ కావాల్సిందే అని సోషల్ మీడియలో మేసేజెస్ మీద మేసేజెస్ ఆ చిత్ర యూనిట్ కి పంపించారు.

అభిమానుల గోడు విని ట్రైలర్ చేస్తున్నారో లేకా వాళ్ల ప్లానింగ్ ఫాలో అవుతూ చేస్తున్నారో తెలియదు కాని, మొత్తానికి ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేస్తున్నామని ఒక ట్వీట్ ఫ్యాన్స్ కు పడేసారు. రోజు దాటిన చిత్రయూనిట్ నుండి ఎటువంటి సమాచారం లేదు.

ఫ్యాన్స్ వెయిటింగ్ .. వెయిటింగ్ ..

“కొడకా… ఓరే నీచ నికృష్టపు కోటేశ్వరరావ
నీ దరిద్రం చెప్పాడానికి నా దగ్గరున్న డైలాగులు సరిపోవడంలేదుర”

అని పాడుకొవడం మినహా ఫ్యాన్స్ చేయగల్గింది ఏమీ లేదు. పచ్చి బూతులు తిడదామంటే సంస్కారం అడ్డొస్తుంది. ఎవరిని తిట్టాలో కూడా తెలియదు. టైం చెప్పి చావచ్చు కదా ఈ నీచ నికృష్టపు దరిద్రులు. ఎవైనా ఇష్యూస్ వుంటే, ఒక మేసెజ్ పెట్టి చావొచ్చు కదా అని నిస్సాహాయక & అమాయక ఫ్యాన్స్ తమ ఆవేదనను సోషల్ మిడియాలో వ్యక్తం చేస్తున్నారు.

మీకో దండం రా బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: