విపరీతంగా నచ్చేసింది

అభిమానుల నుంచి వస్తున్న తిట్లను పట్టించుకోకుండా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ నిన్న అర్థరాత్రి వరకు ఊరించి ఊరించి పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్ర ట్రైలర్ ను 1 గంట సమయంలో రిలీజ్ చేసింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ అన్నమాటే కాని, మరో టీజర్ లానే వుంది. కుర్చీ కథ & ఫ్యాన్స్ అను అలరించే రెండు మూడు డైలాగ్స్ మాత్రమే కలిపారు. కథ ఏమిటనేది క్లియర్ గా చెప్పడానికి ట్రై చెయ్యలేదు. అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. పవన్ బాడీ లాంగ్వేజ్  &  త్రివిక్రమ్ టేకింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. జనాలకు విపరీతంగా నచ్చేసింది.

ఆఫీషియల్ రిలీజ్ జనవరి 10 అయినా, ఒకరోజు ముందు జనవరి 9నే రిలీజ్ అవుతుంది. సంక్రాంతి పండగ సీజన్ కావడంతో ఒక వారం రోజులుపాటు స్పెషల్ షోస్ వేసుకొవడానికి ఆంధ్రప్రదేశ్ & & తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: