శ్రీ కత్తి మహేష్ -దమ్మున్నోడు

సమాజంలో చాలామంది ఇండైరక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సభ్యత కోసమో, సమర్దించుకొవడానికో, పూర్తిగా ఆధారలు లేకో, బెదిరించడానికో. వాళ్ళను పిరికిపందలుగా జమ కడుతూ వుంటారు.

రాజకీయాల్లో అయితే, అన్నీ ఆరోపణలే. కారణం అందరూ(90%) దొంగలే. ప్రజలని వెర్రిపప్పలను చేసి ఎవరి రేంజ్‌లో వాళ్ళు దోచుకుంటారు. పాపం జగన్ విషయంలో చంద్రబాబు/కాంగ్రెస్ ఒకటైపోయి ఇరికించారు. రేవంత్ రెడ్డి చేతులారా చేసుకున్నాడు.

తెలివైనోడు మాత్రమే కాదు, దమ్మున్నోడు కూడా అని నిరూపించుకునే ప్రయత్నంలో శ్రీ కత్తి మహేష్,  పవన్ కల్యాణ్ వెధవ, పవన్ కల్యాణ్ జోకర్, పవన్ కల్యాణ్ బ్రోకర్, పవన్ కల్యాణ్ పిరికిపంద, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను తన మీదకు ఉసి కొలుపుతున్నాడని .. పవన్ కల్యాణ్ కు ఎన్నో ఆపాదించిన శ్రీ కత్తి మహేష్, “అభిప్ర్యాయాన్ని వ్యక్తపరచడం నా హక్కు అంటూ” ఏమి చేసినా డైరక్ట్ గా ఎటాక్ చేస్తూ వచ్చాడు. పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు.

శ్రీ కత్తి మహేష్ చేస్తున్న కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్(<.001%) ఎవరొచ్చిన రీతిలో వాళ్ళు సమాధానం చెప్పారు. శ్రీ కత్తి మహేష్ ను తక్కువ అంచనా వేసి, ఎంతలా విసిగించాలో అంతలా విసిగిస్తున్నారు.

ఫ్యాన్స్ మాదిరే పూనమ్ కౌర్ కూడా ఘాటుగా స్పందించింది కాని, శ్రీ కత్తి మహేష్ పేరు ఎక్కాడా ప్రస్తావించలేదు.

పక్కా ఆధారాలు వున్నాయి కాబట్టి, మీడియాను ఆరోపణలు అనొద్దని ఆదేశిస్తూ, పూనమ్ కౌర్ వ్యక్తిగత జీవితం గురించి ఆరు ప్రశ్నలు మీడియా ముఖంగా శ్రీ కత్తి మహేష్ సంధించాడు.

  1. మీకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? (పవన్ కల్యాణ్ రికమండేషన్ వలనే వచ్చిందని మొన్న ఏదో ఛానల్లో చెప్పాడు. ఆమె నోటి ద్వారా కన్‌ఫార్మ్ చేసుకుందామని మళ్ళీ అడిగినట్టు వున్నాడు)
  2. తిరుపతిలో పవన్ పక్కనే నిల్చోని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
  3. మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకొవాలనుకున్నారు? మీరున్న హాస్పటల్ ఏమిటి? ఎవరు బిల్లు పే చేసారు?
  4. పవన్ మీ అమ్మగారిని కలిసి ఏమని ప్రామిస్ చేసారు?
  5. డైరక్టర్ త్రివిక్రమ్ అంటే మీకెందుకు అంత కోపం?
  6. పవన్ కల్యాణ్ & త్రివిక్రమ్ సమక్షంలో క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన పూజలో మీరు ఏం చేసారో చెప్పగలరా?

ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని ఇలా పబ్లిక్ గా ప్రెస్‌మీట్ పెట్టి మరీ అభాసుపాలు చెయ్యడాన్ని మీడియా హర్షించడం లేదు.  ఆధారాలు ఆమె అడిగితేనే చూపిస్తాను అనడం కేవలం బ్లాక్ మెయిలింగ్ చెయ్యడం కోసమే అని మీడియా భావిస్తున్నట్లు కనిపిస్తుంది.  రాజకీయంగా పవన్ కల్యాణ్ ను దెబ్బతీయడానికే శ్రీ కత్తి మహేష్ వెనుక ఎవరో వున్నారని మీడియా అనుమానిస్తుంది.

త్రివిక్రమ్ బాషలో చెప్పాలంటే పబ్లిక్ లో మాట్లాడకూడని సున్నితమైన అంశాల్లో మరీ ఎక్కువ ప్రెస్ చేసేసాడు.

bottomline:

ఫ్యాన్స్ దృష్టిలో బ్లాక్ మెయిలింగ్ కు భయపడే వ్యక్తి కాదు పవన్ కల్యాణ్.  ఎంత రెచ్చగొట్టినా భరించగలడు. సమయం వచ్చినప్పుడు అదే రీతిలో సమాధానం కూడా చెపుతాడు.  శ్రీ కత్తి మహేష్ కు ఎంత దమ్మున్నా, పవన్ కల్యాణ్ ముందు కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు వూడేది ఏముంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: