వినాయక్‌ వ్యూహం బాగుంది

సాయి ధర్మ్ తేజ్ మెగాఫ్యామిలి నుంచి వచ్చిన హిరో అయినా, హిరోగా నిలబడతాడని ఎవరూ ఊహించలేదు సరి కదా, చాలామంది చాలా వెటకారం చేసారు, ఇంకా చాలామంది చేస్తునే వున్నారు. కాని సాయి ధర్మ్ తేజ్ కు మంచి మాస్ హిట్స్ పడటంతో పాటు,నిర్మాత/దర్శకులకు సాయి ధర్మ్ తేజ్ మీద నమ్మకం వుండటంతో సినిమాలు తీస్తున్నారు. సాయి ధర్మ్ తేజ్ మాస్ ప్రేక్షకుల్లో బాగానే పట్టు సాధించాడు. గత రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సాయి ధర్మ్ తేజ్ సినిమాలకు ప్రిరిలీజ్ హైప్ రావడం లేదు.

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక.

ఎవరొక హిరోకి కనెక్ట్ అవ్వడం, ఆ హిరోను సొంత ఫ్యామిలి కంటే ఎక్కువ అభిమానించడం చాలామంది తెలుగుసినిమా ప్రేక్షకుల వీక్‌నెస్. అభిమానం అనే ఆ వీక్‌నెస్ ని నిందించొ, అభినందించో తాము కూడా న్యూస్లో కొందరు వుండే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త హిరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకుంటూ వుంటారు.  ఇప్పుడు ఇదే టెక్నిక్ సాయి ధర్మ్ తేజ్ సినిమాకు, ఈ సినిమా దర్శకుడు వి.వి. వినాయక్ వాడుతున్నాడు.  

ఈ విషయం గ్రహించిన వినాయక్ అభిమానుల వీక్‌నెస్ వాడుకొని సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్‌ను శనివారం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఇప్పుడు  ఇందులోని ‘లెట్స్‌ డూ..’ అనే పాటను ఆదివారం ప్రభాస్‌ విడుదల చేశారు.  వినాయక్ తీరు చూస్తుంటే, అందరినీ కవర్ చేసే విధంగా ట్రైలర్ జూ ఎన్.టి.ఆర్ తో విడుదల చేయించి, ప్రిరిలీజ్ ఫంక్షన్ కు చరణ్ ను పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: