ఇంటిలిజెంట్ స్టెప్స్ కేక

రామ్‌చరణ్ బెస్ట్ డాన్స్ మూమెంట్స్ అంటే మెగా అభిమానులకు ముందుకుగా గుర్తు వచ్చే సాంగ్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “నాయక్” లో  “లైలా ఓ లైలా”.

వి.వి. వినాయక్ “అల్లుడు శీను” సినిమా ద్వారా ఒక కొత్త హిరోతో సినిమా చేసి, తన రేంజ్ ఏమిటో చూపించుకున్నాడు. అదే క్రేజ్ ను అఖిల్ సినిమాకు కూడా తీసుకురాగల్గాడు కాని, లెక్కలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఖైదీ నెం 150 సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశంతో ఫుల్ ఫార్మ్ లోకి రాకపొయినా, మంచి స్టోరీ వుంటే కమర్షియల్ గా చెప్పగలనని నిరూపించుకున్నాడు.

సాయి ధర్మ్ తేజ్ గత రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యాయి. వాటి ప్రభావంతో వినాయక్ దర్శకత్వలో వస్తున్న ఈ సినిమా “ఇంటిలిజెంట్” పై హైప్ అసలు లేదు.

వినాయక్ అంటే మాస్ డైరక్టర్. ఇది పక్కా మాస్ సినిమా. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. ప్రేక్షకులు ఇంతకు మించి ఇంకా ఏదో కావాలని ఎక్సపెట్ చేస్తుండటం వలన అసలు హైప్ లేదు.  ప్రభాస్ రిలీజ్ చేసిన మొదటి సాంగ్ చాలా మంచి బీట్ తో పాటు క్యాచి లిరిక్స్ తో ఆకట్టుకునే విధంగా వుంది.

వినాయక్ అంటే పాటలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తాడు.  మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు, రిపీట్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే స్టెప్స్ సాయి ధర్మ్ తేజ్ నుంచి ఈ సినిమా ద్వారా ఆశీంచవచ్చు.

వినాయక్ నమ్మే కమర్షియల్ అంశాలు ఈ సినిమాను ఏ రేంజ్ లో నిలబడతాయో తెలియాలంటే ఫిబ్రవరి 9 వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: