పక్కా మాస్ ‘ఇంటిలిజెంట్’ ట్రైలర్

వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో  సుప్రీమ్‌ స్టార్ సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌  నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా జరుగుతున్న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు

వినాయక్ ప్రొజెక్ట్స్ అన్నీ సేఫ్ గా కలక్షన్స్ సాధించే విధంగా మాస్ కథలు ఎంచుకుంటాడు. ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ తన సినిమాలో వుండేట్టు చూసుకుంటాడు. కాని కొన్ని సినిమాల్లో ఆ లెక్కలు తప్పాయి. ఎన్నో ఆశలతో నాగార్జున అఖిల్ ను వినాయక్ చేతిలో పెట్టాడు, కాని వినాయక్ ఆ ఆశలను నిలబెట్టుకొలేకపొయాడు. నిజానికి అది వినాయక్ కు కోలుకొలేని దెబ్బ, కాని చిరంజీవి 150వ సినిమా అవకాశం ఇవ్వడం & ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవడం ద్వారా పెద్ద హిరోల ఇమేజ్ కు తగ్గట్టు చేయగల సత్తా తనకు ఇంకా వుందని నిరూపించుకున్నాడు.

ఖైదీ నెం 150 వ సినిమా తర్వాత వినాయక్ తో చెయ్యడానికి పెద్ద హిరోలు ఎవరూ ఖాళీగా లేకపొవడంతో సాయి ధర్మ్ తేజ్ ను పెద్ద హిరోగా చేసే ప్రయత్నం “ఇంటిలిజెంట్”. మాస్ డైరెక్టర్, మాస్ హీరో కాంబినేషన్‌లో పక్కా మాస్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లుగా ట్రైలర్ తేల్చేసింది. పక్కా మాస్ సినిమాలా ‘ఇంటిలిజెంట్‌’ ఉండబోతుందనేది ట్రైలర్ చూసిన తర్వాత తెలుస్తుంది. మెగా అభిమానులను అలరించడానికి చిరంజీవి & పవన్ కల్యాణ్ ల స్టైల్స్ బాగా వాడుకున్నాడు వినాయక్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: