ఐటం సాంగ్ షూటింగ్లో “రంగస్థలం”

దేవిశ్రీ ప్రసాద్ తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చెయ్యడంలో కింగ్. ఆ సినిమాకు దర్శకుడు సుకుమార్ అయితే ఇంకా రెచ్చిపోయి కంపోజ్ చేస్తాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా “రంగస్థలం”. రామ్‌చరణ్ హిరో. సమంతా హిరోయిన్. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఇందులో కూడా ఒక ఐటం సాంగ్ వుంది. చంద్రబోస్‌  రచించారు. ప్రస్తుతం ఈ పాటను హైదరాబాద్‌లో రామ్‌   చరణ్‌, పూజా హెగ్డేలపై తెరకెక్కిస్తున్నారు. జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ‘జిల్‌ జిల్‌ జిగేల్‌’ అంటూ మొదలవుతుందట.

మార్చి 30న రిలీజ్ కాబోతున్న “రంగస్థలం” ఇటీవల టీజర్‌ విడుదలైంది. అందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ పాత్రని పరిచయం చేశారు. త్వరలోనే సమంతకు సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసే పనిలో వున్నారు ఆ చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: