తొలిప్రేమ -Exclusive Review

తొలిప్రేమ నచ్చిందా? చూడొచ్చా?
నచ్చింది. వరుణ్ తేజ్ మీద పాజిటివ్ సాఫ్ట్ ఓపినియన్ వుంటే, కచ్చితంగా థియేటర్లో చూడొచ్చు.

పవన్ కల్యాణ్ “తొలిప్రేమ” పవన్ కల్యాణ్‌లో ఆత్మ విశ్వాసం నింపిన సినిమా. మరి ఈ “తొలిప్రేమ” సినిమా?
పవన్ కల్యాణ్ “తొలిప్రేమ” కు, దీనికి అసలు సంబంధం లేదు. అసలు పోల్చలేము.

కథ ఏమిటి?
తొలిచూపు లోనే ప్రేమ. బ్రేకప్ .. ప్రేమ .. బ్రేకప్ .. మళ్ళీ ప్రేమతో హ్యాపీ ఎండింగ్.

వరుణ్ తేజ్ ఎలా చేసాడు?
వరుణ్ తేజ్ ఇరగదీసేసాడు.

ఫిదా సినిమా పేరంతా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి & దిల్ రాజు కొట్టేసారు. ఈ సినిమా సంగతి ఏమిటి?
హమ్మయ్య ..

మెగా హిరో సినిమా అంటే హిరో డామినేషన్ వుండాలంతే. మెగా అభిమానులు కొరుకునేది అదే. ఫిదా హిరోయిన్ డామినేషన్‌తో హిట్ అవ్వడం చాలా మంది మెగా అభిమానుల ఇగో దెబ్బతింది. ఈ సినిమాతో ఇగో దెబ్బ తిన్న మెగాభిమానులు కలర్ ఎగరేసే సినిమా.

హిరోయిన్?
హిరోయిన్ హిరో కంటే కొద్దిగా పెద్ద దానిలా వుంది, కాని హిరోకు పర్సనాల్టీ వుంది కాబట్టి ఎబ్బెట్టుగా అనిపించలేదు. బాగా చేసింది.

పాటలు ఎలా వున్నాయి? బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా వుంది?
థమన్ ఇరగదీసేసాడు. వరుణ్ తేజ్ డాన్స్ బాగానే చేసాడు. పాటలన్నీ బాగున్నాయి.

హైలట్స్ ఏమిటి?
సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మైంట్ వేలో సాగడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అనొచ్చు. రైల్వే స్టేషన్ దగ్గర రెండు మూడు సీన్స్ లో పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తాడు. కోపం సీన్స్ లో అర్జున్ రెడ్డి గుర్తుకు వస్తాడు.

సెకండాఫ్ హైపర్ ఆది డైలాగ్స్ బాగానే పేలాయి. నరేష్ క్యారెక్టర్ ప్రతి ఎన్.ఆర్.ఐ కి ఎక్కడో/పక్కనో చూసామన్న ఫీలింగ్ వస్తుంది.

ఏమి బాగోలేదు?
కొత్తగా ఏమి ట్రై చెయ్యకపొవడం వలన కొందరికి సెకండాఫ్ సాగదీసినట్టుగా మరియు రొటీన్ అనిపించవచ్చు. కాని, ఫిదా సెకాండాఫ్ మీద తొలిప్రేమ సెకాండాఫ్ వెయ్యి రెట్లు బెటర్ వుంది. హైపర్ ఆది క్యారెక్టర్ & పంచ్ లైన్స్ బాగున్నాయి కాని, ఇంకా బాగుండేలా ఇంకొద్దిగా హోంవర్క్ చేసుంటే ఇంకా బాగుండేది.

ఫిదా ను మించిన సినిమా అవుతుందా?
వేరే సినిమాల నుంచి గట్టి పోటి వుంది కాబట్టి, కమర్షియల్ గా ఫిదా అంత సక్సస్ అవ్వడం కష్టమెమో. వరుణ్ తేజ్ పరంగా ఫిదా కు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పవచ్చు. యూత్ కు కచ్చితంగా బాగా నచ్చుతుంది.

bottomline:
దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా ఇది. పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమాను కరుణాకరన్ ఎంత ప్రగడ్భంధీగా వ్రాసుకున్నాడో, అంతే ప్రగడ్భంధీగా ఈ తొలిప్రేమ సినిమాను వెంకీ అట్లూరి వ్రాసుకున్నాడు, అంతే క్లారిటీతో తీసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: