అ! -Exclusive Review

Note: ఈ కామెంట్స్ అన్నీ వ్యక్తిగత అభిప్రాయం.

సినిమా ఎలా వుంది? నచ్చిందా?
దిక్కుమాలిన సినిమా నచ్చడమా? రెండు గంటలు టైం వేస్ట్ అయ్యింది.

రెండు గంటలు టైం వేస్ట్ చేసుకొని రివ్యూ వ్రాయడం టైం వేస్ట్ కాదా?
సినిమా చూసాక వచ్చిన frustration తీరే అవకాశం వుందని ఆశ.

నాని రిస్క్ ఎందుకు చేసాడు?
షార్ట్ ఫిలిం బడ్జెట్ తో తీసిన సినిమా రిస్క్ ఎలా అవుద్ది? బుద్దున్న నిర్మాత ఎవడూ తీసే ప్రయత్నం చెయ్యడు.

కథ ఏమిటి?
ఆ దేవుడికే తెలియాలి.

ఇంటర్వెల్ & క్లైమాక్స్ ట్విస్ట్స్ ఏమిటి?
రివ్యూల్లో ట్విస్ట్లు చెప్పొద్దు, అది చెప్పద్దు , ఇది చెప్పొద్దు అనే నాని విడియో చూసి పబ్లిసిటిలో భాగం, సినిమా నిజంగా అద్భుతమెమో అనుకున్నాను. పచ్చి మోసం. సినిమా అసలేమి అర్దం కాలేదు సరికదా.. అర్దం చేసుకొవాలని & డిస్కస్ చెయ్యాలని ఇంటరెస్ట్ కూడా లేదు.

వెబ్ రివ్యూస్ ఎందుకంత పాజిటివ్ గా వున్నాయి?
అందరికీ నచ్చదు. కొందరికే నచ్చుతుందంటే, ఆ కొందరిలో నేనుంటాననుకొని ఆశతో సినిమాకు వెళ్ళి, రెండు గంటలు టైం వేస్ట్ చేసుకున్నాను. నాని మాటలు విని మోసపొయాను.

అసలేమి నచ్చలేదా?
సినిమా అంతా భరించడం కష్టం అనిపించింది. ప్రియదర్శన్ ఎపిసోడు & మురళీ శర్మ ఎపిసోడు మాత్రం బాగున్నాయి. బిగినింగ్ నిత్యా పంచ్ కూడా బాగుంది. పంచ్ కాదు నిజమే అని తెలిసాక చిరాకేసింది.

bottomline:
అ! – ఒక దిక్కుమాలిన సినిమా. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా తర్వాత, సినిమాల మీద విరక్తి కలిగించిన మరో సినిమా అ!.(అజ్ఞాతవాసి చూడలేదు)

సినిమా ఒక అబద్ధం .. సినిమా పబ్లిసిటి ఒక మోసం అనుకుంటే:

“అ!” సినిమా, ఒక అర్దం కాని పచ్చి అబద్ధం. “అ!” సినిమా పబ్లిసిటి మోసాలకే మోసం.

ఈ సినిమా నచ్చిన వాళ్ళకు, నాకు నచ్చనందుకు నా క్షమాపణలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: