రంగస్థలం బడ్జెట్ ఎంత?

షార్ట్ ఫిలిం బడ్జెట్ తో తీసిన సినిమా అయినా, హలీవుడ్ ఫిలిం బడ్జెట్ తో తీసిన సినిమా అయినా, థియేటర్లో చూడాలంటే ఒకటే ధర. అటువంటప్పుడు “సినిమా బడ్జెట్ ఎంత అనేది ప్రేక్షకుడికి అవసరమా?” అంటే, కాదనే చెప్పాలి.

పలానా సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేసాం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం, ఎక్కువ శ్రద్ద వహించాం అనే మాటలు ప్రేక్షకులకు సినిమా మీద నమ్మకం పెంచడానికి, ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు వాడుతుంటారు. సినిమా మరీ చెండాలంగా వుంటే ఎవరూ కాపాడలేరు కాని, సినిమా ఎవరేజ్ గా వున్నప్పుడు పై మాటలు బాగా ఉపయోగపడతాయి. అంత కష్టపడి అంత ఖర్చుతో మనల్ని రంజింపచేయడానికి వాళ్ళు సినిమా తీసారు, ఒకసారి చూసి ఎంకరేజ్ చేద్దాం అనే సానుభూతి ప్రేక్షకులకు కలిగి, సినిమాల కలక్షన్స్ పెరుగుతాయి.

మన తెలుగుసినిమా ఇండస్ట్రీ హిరో డామినేషన్ ఇండస్ట్రీ. హిరోను బట్టే ఓపినింగ్స్ వుంటాయి, హిరోను బట్టే బిజినెస్ జరుగుతాది. హిరో రేంజ్‌కు ఫార్మ్ లో వున్న దర్శకుడు తోడయితే ఆ సినిమకు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈనెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకో ప్రత్యేకత వుంది, అది ఏమిటంటే పల్లెటూరి నేపథ్యంలో 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

“సుకుమార్ గత రెండు సినిమాలు ఒన్(నేనొక్కడినే)” .. “నాన్నకు ప్రేమతో” .. పూర్తి స్థాయిలో కమర్షియల్ సక్సస్ సాధించకపొయినా, హిరోలకు & హిరో అభిమానులకు అమితమైన ఆనందాన్ని కలుగజేసాయి. సుకుమార్ రామ్‌చరణ్‌ కాంబినేషన్ అనగానే, కమర్షియల్ సక్సస్ విషయంలో కొద్దిగా భయం అనిపించినా, రామ్‌చరణ్‌ కు వైరటీ సినిమా అవుతాదని మెగా అభిమానులు ఆనందించారు.

80 % అభిమానులు గొప్పగా చెప్పుకొవడానికి కావాల్సింది కమర్షియల్ సక్సస్. మా హిరో సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసిందని చెప్పుకుంటూ వుంటారు. రంగస్థలం ఎంత కమర్షియల్ సక్సస్ అవుతుందో తెలియదు కాని, భారీగా ఖర్చు పెడుతూ భారీగా కష్టపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రతి సినిమాకు కష్టపడతారు, ఖర్చు పెడతారు .. కానీ, రంగస్థలం సినిమా కోసం ఎంచుకున్న నేపథ్యం సినీ విశ్లేషకులు, సినీ ప్రేమికులు, సినీ విమర్శకుల్లో సరికొత్త ఇంటరెస్ట్ క్రియేట్ చేసాయి.

bottomline:
రంగస్థలం బడ్జెట్ ఎంత అనేది అనవసరం. సుకుమార్-చరణ్ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఎవరేజ్ అనిపించుకున్నా, సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి ప్రేక్షకులు రెడీగా వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: