రంగా…రంగ స్థలానా

రంగా…రంగా రంగస్థలానా
రంగా…రంగ రంగస్థలానా

వినపడేట్టు కాదురా…కనపడేట్టు కొట్టండెహే

రంగా రంగా రంగస్థలానా.. రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట

రంగా…రంగా రంగస్థలానా.. ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట

కనపడని సెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంట
వినపడని పాటకి సిందాడేస్తున్న తొలు బొమ్మలం అంట

డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు

రంగా రంగా రంగస్థలానా.. రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట

గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా, గాలంటే హనుమంతుడి నాన్న గారంట
గాలి పీల్చడానికైన,గొంతు తడవడానికైన….. వాళ్ళు కనికరించాలంటా.!!!

వేణువంటె కిట్టమూర్తి వాద్యం అంట శూలమంటె కాళికమ్మ ఆయుధమంట
పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాళ్ళు ఆనతిస్తెనే అన్నీ జరిగేనంటా

రంగా రంగా రంగస్థలానా.. రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట

డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు

పదితలలూ ఉన్నొడు రావణుడంటా.. ఒక్క తలపుకూడ చెడు లేదే రాముడికంటా
రామరావణులబెట్టి రామయణమాటగట్టి.. మంచిచెడులమధ్య మనని పెట్టారంట

ధర్మాన్నీ తప్పనోడు ధర్మరాజటా.. దయలేనీ వాడు యమధర్మరాజటా
వీడిబాట నడవకుంటె వాడివేటు తప్పదంటు.. ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నరంటా..

రంగా రంగా రంగస్థలానా.. ఆడటానికంటె ముందు సాధనంటు సెయ్యలేని
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట

డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుమ్కో డుంగురు డుంగురు డుంగురు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: