‘వారం’ సాంగ్ కూడా డిఫరెంట్ గా వుంది

నితిన్‌ 25వ సినిమా “చల్ మోహన్ రంగ”.  కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించడం విశేషం.  శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ‌లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ ఆకాష్ఈ సినిమాలో నితిన్ తో జతకట్టింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీంకు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఒక్కొటొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ చేసిన మేఘ సాంగ్ ప్రెష్ ట్యూన్ అని అందరూ అంటుంటే, రెండొ సాంగ్ గా ఈరోజు రిలీజ్ అయిన ‘వారం’ సాంగ్ కూడా డిఫరెంట్ గా వుందని టాక్ తెచ్చుకుంది.

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ “తొలిప్రేమ” సినిమా సక్సెస్ లో తన మ్యూజిక్ ద్వారా కీ రోల్ పోషించిన ధమన్, అదే ఊపులో  “చల్ మోహన్ రంగ”  సినిమాకు మంచి ట్యూన్స్ ఇవ్వడం ఈ సినిమా సక్సస్ కు దోహదపడుతుందనుకొవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: