‘రంగస్థలం’ 3వ పాట “రంగమ్మ .. మంగమ్మ”

రామ్‌చరణ్ హిరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం రంగస్థలం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా సమంత నటిస్తోంది.

‘ధృవ’ సినిమా రిమేక్ అయినా ఆ సినిమా కోసం రామ్‌చరణ్ చాలా కష్టపడ్డాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రామ్‌చరణ్ కంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఆ సినిమా కమర్షియల్ గా మెగా రేంజ్ సినిమా అవ్వకపొయినా, మెగా అభిమానుల్లో రామ్‌చరణ్ కు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది.

ధృవ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు రంగస్థలం కోసం అంతే కష్టపడుతున్నాడు రామ్‌చరణ్. సుకుమార్ గురించి చెప్పక్కర్లేదు. మెగా రేంజ్ లో కమర్షియల్ సక్సస్ అవుతుందా అనేది వేచిచూడాలి.

‘రంగస్థలం’ పాటలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1st సాంగ్ “ఎంత సక్కగున్నావే”
2nd సాంగ్ “రంగా రంగా రంగస్థలానా”

మోర్ దేన్ 70% తెలుగు సినిమా ప్రేక్షకులకు రెండు మూడు సార్లు వినంగానే విపరీతంగా నచ్చేసాయి. లిరిక్స్, మ్యూజిక్ .. కరెక్ట్ గా బ్లెండ్ అయ్యాయంటున్నారు. ఈ సినిమా కోసం అన్ని రోజులు పడిన కష్టం పాటల్లో వినిపించింది.

3rd సాంగ్ ‘రంగమ్మ మంగమ్మ’ మార్చి 8న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: