“భరత్ అనే నేను” పబ్లిసిటి కోసం ప్రధానమంత్రి

koratala siva Verified account@sivakoratala
Let’s all make @narendramodi ji a MAN by reminding his promise to Andhra Pradesh. Do u honestly feel that telugu states are a part of India sir?

‘చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’.. ‘భరత్‌ అనే నేనూ..’ అన్న సంభాషణతో సాగిన చిత్ర ప్రచార చిత్రం మార్చి 6 , 2018 మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది.

కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్‌ ఐ యామ్‌ ఎ మ్యాన్‌ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్‌’ అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్‌ మొత్తం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.

ఈ డైలాగ్స్ ప్రతి రాజకీయనాయకుడికి వర్తిస్తాయి. కచ్చితంగా ఆ క్షణంలో ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా క్రియేటర్ కొరటాల శివ సామాజిక సృహతో ప్రస్తుత్త రాజకీయల్లో జరుగుతున్న అవినీతి/కుట్ర/కుతంత్రాలను చూపించడం కచ్చితంగా అభినందించవలసిన విషయం.

డబ్బు/కులం/ప్రాంతం/మతం అనే ప్రజల వీక్‌నెస్ ను వాడేసుకొని, వాళ్ళకు ప్రశ్శించే హక్కు లేకుండా చేస్తుంటారు మన రాజకీయ నాయకులు. వాళ్ళను తలదన్నే రీతిలో తన సినిమా “భరత్ అనే నేను” పబ్లిసిటీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రినే వాడేసుకుంటున్నాడు ఈ సినిమా సృష్టికర్త కొరటాల శివ. ఆయన తెలివితేటలకు🙏🙏🙏

ఇప్పటి వరకు ప్రజలను మభ్యపెట్టిన ముఖ్యమంత్రిని మాత్రం వదిలేసాడు.బహుశా నెక్స్ట్ రౌండ్ పబ్లిసిటీలో వాడుకుంటాడెమోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

bottomline:
డైరక్ట్ గా మన దేశ ప్రధానమంత్రినే సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న కొరటాల శివ తెలివితేటలకు🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: