అల్లు అర్జున్‌పై మెగా విమర్శలు

పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”. అల్లు అర్జున్‌ హీరో. అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  మే 4న రిలీజ్.  లగడపాటి శ్రీధర్ & బన్నీ వాసులు నిర్మాతలు. నాగబాబు ఏమి పెట్టుబడి పెట్టకుండానే కొద్దిగా లాభం వచ్చేలా అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేసింది.

ఈ రోజు(ఆదివారం) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్‌ ఇంపాక్ట్‌ ను రిలీజ్ చేశారు. విలన్‌ ‘సౌత్ ఇండియాకా సాలా’ అంటే ‘సౌత్ ఇండియా.. నార్త్‌ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్‌.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ బాగా ఆకట్టుకునేలా చిత్రీకరించాడు వక్కంతం వంశీ.

ఇంపాక్ట్ బాగున్నా అల్లు అర్జున్‌పై మెగా విమర్శలు జోరు ఎక్కువైంది. ట్విటర్లో సౌత్ ఇండియన్ యాక్టర్ అని పెట్టుకొని, విలన్ కు సౌత్, నార్త్ , ఈస్ట్, వెస్ట్ లేదంటూ క్లాసులు పీకడం ఏంట్రా అంటూ అల్లు అర్జున్ ను గేలి చేస్తున్నారు.

మెగాస్టార్ & మెగాస్టార్ అభిమానుల అండతో స్టార్డం సంపాదించుకొని, మెగాస్టార్ అండతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో తండ్రి సాధించిన పట్టును/పలుబడిని చూసుకొని, మెగా అభిమానులను పబ్లిక్‌గా పలుసార్లు అవమానించిన సంగతి అందరికీ తెలిసిందే.

చూసీ చూడనట్టు వదిలేయవలసిన విషయాలు వేరే హిరో అభిమానులు లేవనెత్తుతారు, అభిమానులు సరైన సమాధానం చెపుతారు. అల్లు అర్జున్ విషయంలో (అల్లు అర్జున్ కుళ్ళు బయట పడేదాకా మోసిన) మెగా అభిమానులే లేవనెత్తుతున్నారు.

bottomline:

ఎవరెన్ని విమర్శలు చేసినా, సమాధానం చెప్పడానికి ఒక పెద్ద టీం(AA army) వుంది అల్లు అర్జున్ కి. that is Stylish Star Allu Arjun.  ట్రెండ్ సెట్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: